ప్రపంచ క్రికెట్లో ఎంత మంది స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ అటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అందరికంటే తోపు అని అంటూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులను చూసి ఇక ఇలాంటి మాట అంటూ ఉంటారు అని చెప్పాలి. తన బ్యాటుతో ఇప్పటికే ఎంతోమంది ప్రత్యర్థులను వనికించిన విరాట్ కోహ్లీ ఇక ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇక ఇలా బ్యాటింగ్లో రికార్డులు సాధించడం విషయంలో ఏ బ్యాట్స్మెన్ కూడా కోహ్లీకి చేరువలో కూడా లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే విరాట్ కోహ్లీ కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదండోయ్ అటు ఫీల్డింగ్ లో కూడా తోపు అనే చెప్పాలి. ఎందుకంటే అతను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేసే విన్యాసాలు చూసిన తర్వాత అతని లాగా ఇంకెవరూ ఫీల్డింగ్ చేయలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక మెరుపు వేగంతో కదులుతూ అద్భుతమైన క్యాచ్లను కూడా అందుకుంటూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అందుకే ఎంతోమంది క్రికెటర్లు అటు విరాట్ కోహ్లీని ఫీల్డింగ్ లో స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.


 300 అంతర్జాతీయ క్యాచ్ లను పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్ లను అందుకున్న రెండో భారత క్రికెటర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో నాథన్ లియాన్ క్యాచ్ పట్టాడు
 తద్వారా ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ రికార్డు సాధించిన ప్లేయర్ల లిస్టు చూసుకుంటే.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టాప్ లో ఉన్నాడు. 334 క్యాచ్ లతో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో చూసుకుంటే శ్రీలంక ప్లేయర్ మహేళా జయవర్ధనే 440 క్యాచ్ లతో తోలు స్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ 364, రాస్టేల్ 351, కల్లిస్ 338 ద్రవిడ్ కంటే ముందున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: