గత కొంతకాలం నుంచి భారత జట్టులో ఉన్న కీలక ప్లేయర్స్ అందరూ కూడా వరుసగా గాయాల బారిన పడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా జట్టులో ఉన్న ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో.. ఇక జట్టు వ్యూహాలు మొత్తం తారుమారు అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే మొన్నటివరకు వెన్నునొప్పి గాయంతో బయపడిన శ్రేయస్ అయ్యర్ ఇక ఆస్ట్రేలియాలతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయాడు. కానీ ఆ తర్వాత రెండో మ్యాచ్ కు అందుబాటులోకి వచ్చాడు అని చెప్పాలి.


 గాయం నుంచి కోలుకొని వచ్చాడు కదా.. అతను పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఇక టెస్ట్ మ్యాచ్లో అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కానీ అంతలోనే మళ్లీ గాయం బారిన పడ్డాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఇటీవలే అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి రాలేదు అని చెప్పాలి. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేయడానికి కూడా శ్రేయస్ అయ్యర్ రాకపోవడం గమనార్హం. దీంతో శ్రేయస్ గాయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే అతని వెన్నునొప్పి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి ఇక ఆ గాయానికి శాశ్వత పరిష్కారం కనుగొనే పనిలో బీసీసీఐ పడిందట. ఇక ఇప్పటికే అతనికి స్కానింగ్ తీయించినట్లు తెలుస్తుంది.  అయితే రిపోర్టులు ఇంకా రాలేదట. అయితే శ్రేయస్ అయ్యర్ సర్జరీ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు శ్రేయస్ అయ్యర్ ఇక క్రికెట్కు దూరం కాబోతున్నాడు అని చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ తో పాటు  ఐపీఎల్ సహా మరికొన్ని సిరీస్ లకు కూడా దూరం కాబోతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: