భారత క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించి లెజెండరీ క్రికెటర్గా ఎదిగాడు వీరేంద్ర సెహ్వాగ్ . ఇక వీరేంద్ర సెహ్వాగ్ అప్పట్లో తన బ్యాటింగ్తో సృష్టించిన విధ్వంసం అంతా కాదు అని చెప్పాలి. ఏకంగా వీరేంద్ర సెహ్వాగ్ కు బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఇక బౌలర్లు భయపడుతూనే బంతులు వేసేవారు అని చెప్పాలి. ఇక మొదటి బంతికి సిక్సర్ కొట్టి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో ఒక వీరేంద్ర సెహ్వాగ్ దిట్ట అని చెప్పాలి. ఇలా తన కెరీర్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.


 అయితే ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా అభిమానులకు మాత్రం సోషల్ మీడియా వేదికగా దగ్గరగానే ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎప్పుడు క్రికెట్కు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెట్టి తనదైన శైలిలో ఫన్నీ కామెంట్లు జోడిస్తూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్.


ఒకప్పుడు అనిల్ కుంబ్లే తో విభేదాల నేపథ్యంలో ఇక భారత జట్టుకు హెడ్ కోచ్గా ఉండాలని అప్పుడు భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీతో పాటు ఇక బిసిసిఐ కార్యదర్శిగా ఉన్న అమితాబ్ సైతం తనను కోరారు అన్న విషయాన్ని ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిసిన తర్వాత వెస్టిండీస్ లో పర్యటించాలని వారు చెప్పారు. అయితే నాకు స్పెషల్ ట్రైనర్ తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్  కోచ్ కూడా అవసరం ఉంటుందని నేను చెప్పాను. వారిని స్వయంగా నేనే ఎంచుకుంటానని చెప్పాను. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు భారత హెడ్ కోచ్గా అవకాశం రాలేదు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: