సాధారణంగా క్రికెట్లో మూడు ఫార్మాట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే మూడు ఫార్మట్లలో ఎక్కువగా ఆటగాళ్లు ఇష్టపడేది మాత్రం ఒక ఫార్మాట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ ఫార్మాట్ ఏదో కాదు సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడటానికి ఆటగాళ్లు ఇష్టపడినప్పటికీ అటు టెస్ట్ ఫార్మాట్లో రికార్డులు సృష్టించడానికి మాత్రం ఎంతో మంది ప్లేయర్స్ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే టెస్ట్ ఫార్మాట్ ఆటగాళ్ల ప్రతిభకు సవాల్ విసురుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్లో ఇక ఆటగాళ్లలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసే అవకాశం కూడా ఉంటుంది. పరుగులు చేయకుండా ప్రతి బంతిని డిఫెన్డ్ చేసే బ్యాట్స్మెన్లు వారిని అవుట్ చేయడానికి బౌలర్లు పడేది కష్టాలు. ఇక మరోవైపు బౌలర్లు సంధించే వైవిద్యమైన బంతులను డిఫెన్డ్ చేయడానికి బ్యాట్స్మెన్లు పడే ఇబ్బందులు అటు టెస్ట్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అందుకే టెస్ట్ ఫార్మాట్ కాస్త నెమ్మదిగా సాగిన అటు బౌలర్లు బ్యాట్స్మెన్లకు మాత్రం సవాల్ లాంటిదే అని చెప్పాలి. అయితే సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో రికార్డులు సృష్టించాలనుకునే ఆటగాళ్లు ఎప్పుడు అత్యుత్తమమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటారు.


 ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జో రుట్ సాంప్రదాయమైన టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన మైలు రాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఐర్లాండ్  తో జరిగిన టెస్ట్ లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 11 వేల పలుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లాండ్ క్రికెటర్ గా ఓవరాల్ గా 11 వ క్రికెటర్ గా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇంగ్లాండు తరఫున వేగంగా 11 వేల పరుగులు చేసిన కుక్ రికార్డును రూట్ బద్దలు కొట్టాడు అని చెప్పాలి. కుక్ 252 ఇన్నింగ్స్ లలో 11 పరుగులు చేస్తే అటు జో రూట్ 232 ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: