టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా  మరోసారి సత్తా చాటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపిఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోని.. ఇక 2023 ఐపీఎల్ సీజన్లోనూ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేశాడు. ఏకంగా చెన్నై జట్టును టైటిల్ విజేతగా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా మహేంద్ర సింగ్ ధోని ఇలా టైటిల్ గెలిచిన సమయంలో కెప్టెన్ గా ట్రోఫీ అందుకున్న తర్వాత ఆ ట్రోఫీ ని తీసుకెళ్లి ఇక జట్టులో ఉన్న యంగ్ ప్లేయర్స్ ఇచ్చి తాను ఏమీ తెలియనట్లుగా పక్కన నిలబడటం చూస్తూ ఉంటాము.


 అయితే ధోనిలో ఉన్న ఈ సింప్లిసిటీనే అటు అభిమానులు అందరినీ కూడా ఫిదా చేసేసింది. ఇక ఆ తర్వాత కాలంలో వచ్చిన కెప్టెన్స్ కూడా ధోని చేసిన విధంగానే చేయడం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లో చెన్నై టైటిల్ గెలిచిన సమయంలో కెప్టెన్గా ధోని టైటిల్ అందుకోవాల్సి ఉంది. అలాంటి సమయంలో ధోని మాత్రమే కాకుండా టైటిల్ అందుకోవడానికి స్టేజ్ మీదకి జట్టులో ఉన్న మరో ఇద్దరు సీనియర్ క్రికెటర్లను కూడా పిలిచాడు. ఆ సీనియర్ క్రికెటర్లు ఎవరో కాదు.. చివర్లో రెండు బంతులకు సిక్సర్, ఫోర్ కొట్టి చెన్నై ను గెలిపించిన రవీంద్ర జడేజా.. కీలక ఇన్నింగ్ ఆడి చెన్నై ను గెలిపించి ఇక తన వీడ్కోలు మ్యాచ్ ఆడిన అంబటి రాయుడు.


 ఇద్దరినీ స్టేజ్ మీదకి పిలిచి ఇక తనతో పాటు ట్రోఫీ అందుకునేలా చేసాడు ధోని. ఇక ఇదే విషయంపై అంబటి రాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని చర్య పట్ల ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని మ్యాచ్.. అనంతరం ధోని తన గురించి మాట్లాడటం కూడా ఆనందంగా ఉందని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. ముగింపునకు కాస్త ముందు నన్ను జడేజాను ధోని పిలిచాడు. ట్రోఫీ అందుకోవడానికి తనతో పాటు మమ్మల్ని రమ్మన్నాడు. మా ఇద్దరితో అలా చేయించడం ఇదే సరైన సమయం అని ధోని భావించాడు. అయితే మాకు ఇది ప్రత్యేకమైనది. మళ్లీ ఇలా జరుగుతుందని అనుకోవట్లేదు. ధోని సంగతి ప్రపంచమంతా తెలుసు అంటూ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: