మహదారి కరోనా... మాయదారి లాక్ డౌన్ ! మా చచ్చే చావొచ్చిందిరో..! ఊరిగాని ఊరిలో.. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ... చావేతనా పడాల్సి వస్తోంది. ఉండలేము... వెళ్లలేము అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దేశమంతా ఆ మోదీ మహానుభావుడు తాళం వేసేశాడు. వేసాడు సరే ముందు ఒక్కరోజు మాత్రమే తాళం అన్నాడు. సర్లే ఒక్కరోజే కదా అని రిలాక్స్ అయితే ... మళ్ళీ ఇరవై రోజులకు పైగా తాళం వేశారు. సర్లే అనుకోని విపత్తు కదా ఏదోలా తంటాలు పడదాం లే అనుకుని ఏప్రిల్ 14  వరకు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూపులు చూస్తే... మళ్లీ మే మూడు వరకు అని చెప్పి ... మీ చావు మీరు చావండి అంటూ వదిలేశారు. ఒక పక్క కరోనా భయం ... మరో పక్క సొంత ఊరికి వెళ్లలేక ... ఇప్పుడు తలదాచుకుంటున్న  బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఇళ్లల్లో ఉండలేక పడే బాధ అంతా ఇంతా కాదు. 

IHG

ఇక్కడ కాస్త ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉందా అంటే... ? టీవీల్లో చుపిస్తున్నట్టుగా దారి మధ్యలోనో... నడుచుకుంటూ సొంత ప్రాంతాలకు వెళ్లలేక, ఉన్న చోట ఆకలి బాధలు పడలేక...ఎవరో పంచిపెట్టే భోజనం పొట్లాల కోసం ఎదురు చూడలేక ... జనాలు పడుతున్న బాధలు చూస్తుంటే ... హమ్మయ్య మనకి ఆ పరిస్థితి రాలేదులే అని కాస్త ఊరట చెందడమే. అయినా రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇరుక్కుపోయిన వారు ఎన్ని వందలు, వేలమంది ఉన్నారో ..! పెళ్ళిళ్ళకి, పేరంటాలకు, పంక్షన్లకు రాష్ట్రాలు ధాటి వచ్చి అడ్డంగా లాక్ అయిపోయిన వారు ఎంతమందో. వారి బాధ అంతా ఇంతా కాదు. ఒక చోట 20 - 30  మంది చుట్టాల ఇంటిదగ్గర ఇరుక్కుపోయి బాధపడుతుంటే... వారికి వండిపెట్టలేక ఆ చుట్టాలు పడుతున్న బాధ చూస్తుంటే ... అబ్బో అబ్బో .. ఆ బాధ అంత ఇంతా కాదు. 

 


ఇక పొద్దున్న లేస్తే చాలు టీవీల్లో లాక్ డౌన్ గురించి ఏమి చెప్పాడా ..? ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారు... కరోనా కేసులు మన రాష్ట్రం లో, మన జిల్లాలో, మన మండలంలో, మన ఊరిలో ఎన్ని పెరిగాయి... ? ఇలా లెక్కలు చూసుకుంటూ టెన్షన్ గా బతికేస్తున్నవారు ఎందరో ..? అసలు మనమంటూ చుట్టాల ఇంటి దగ్గర ఏదో మర్యాదలతో బాగానే బతికేస్తున్నా ... అసలు ముక్కు, మొకం తెలియని వారు ... ఏదో పని మీద వెళ్లి ఇతర ప్రాంతాల్లో చుక్కుకుని విలవిల్లాడుతున్న వారి పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోంది.      మనం కుయ్యో మొర్రో అన్నా... మా ఊరు వెళ్ళిపోతా అని మారం చేసినా ప్రయోజనం లేదు అన్న సంగతి తెలిసినా ... ఇలా ప్రతి రోజు లాక్ డౌన్ ఎందుకు పెట్టార్రా నాయనా ... ఏమ్మా కరోనా నీకు కనీసం మా మీద కనికరం లేదా అనుకుంటూ ... తిట్టుకుంటూ మే మూడు వరకు ఏదో అ........లా కాలక్షేపం చెయ్యడం ఒక్కటే మార్గం ! అయ్యా మోదీ మే మూడో తేదీన అయినా లాక్ ఓపెన్ చేస్తారా ...? మళ్లీ వాయిదాలు వేసి మరోసారి మాతో గేమ్ ఆడుకుంటారా ..? జరా ఆన్సర్ చెప్పరాదే ...! 

మరింత సమాచారం తెలుసుకోండి: