అవినీతి ఆరోపణలపై మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఏసిబి అరెస్టు చేయగానే చంద్రబాబునాయుడు, నారా లోకేష్ చేస్తున్న గోల, యాగీ అందరూ చూస్తున్నదే.  అచ్చెన్నను అరెస్టు చేసిన దగ్గర నుండి  మాజీ మంత్రితో మాట్లాడటానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశాడు. ఫోన్లో మాట్లాడించటానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో శుక్రవారం రాత్రి లోకేష్ ను హడావుడిగా విజయవాడకు పంపించాడు. అక్కడ లోకేష్ కూడా అచ్చెన్నతో మాట్లాడేందుకు నానా ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు.

 

చివరకు మాజీమంత్రిని జడ్జి నివాసంలోకి తీసుకువెళుతున్నపుడు కూడా మాట్లాడేందుకు లోకేష్ ప్రయత్నించాడు. అచ్చెన్నతో మాట్లాడటంలో లోకేష్ ఫెయిలయ్యాడని అర్ధమవ్వగానే వెంటనే హైదరాబాద్ నుండి చంద్రబాబు హుటాహుటిన విజయవాడకు చేరుకున్నాడు. జైలుకే నేరుగా వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే రిమాండ్ ఖైదీని అందులోను కరోనా వైరస్ కారణంగా జైలులోకి ఎవరిని అనుమతించేది లేదని  జైళ్ళశాఖ అధికారులు తేల్చి చెప్పారు. తర్వాత అచ్చెన్నను గవర్నమెంటు జనరల్ ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని వెంటనే అక్కడకు వెళ్ళాడు.

 

అయితే ఆసుపత్రి సూపరెండెంట్ అడ్డుకున్నాడు. తమ ఆసుపత్రిలోని రిమాండ్ ఖైదీని కలుసుకునేందుకు అనుమతిచ్చే అధికారం తమకు లేదన్నారు. మెజిస్ట్రేట్ నుండి అనుమతి తెచ్చుకుంటే తప్ప  లోపలకు ఎవరినీ అనుమతించేది లేదని చెప్పటంతో సూపరెండెంట్ పై చంద్రబాబు ఫుల్లుగా ఫైర్ అయ్యాడు. కరోనా వైరస్ కారణంగా కూడా ఎవరినీ లోపలకు అనుమతిచ్చేది లేదని సూపరెండెంట్ తేల్చె చెప్పాదు. దాంతో సూపరెండెంట్ ను చంద్రబాబుకు ఆసుపత్రి బయటకు పిలిపించి దాదాపు గంటసేపు మాట్లాడాడు.

 

తన లాయర్లను దగ్గర పెట్టుకుని చంద్రబాబు చేసిన అన్నీ ప్రయత్నాలు విఫలమవ్వటంతో చేసేది లేక కరకట్టకు తిరిగి వెళ్ళిపోయాడు.  అసలు అచ్చెన్నను కలవటానికి చంద్రబాబు, లోకేష్ ఎందుకింతగా ఆతృతపడిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు.  మాజీమంత్రి అరెస్టు విషయంలో కుటుంబ సభ్యులతో ఎలాగూ మాట్లాడారు. రాష్ట్రమంతా ఆందోళనలు చేయమని నేతలకు, శ్రేణులకు పిలుపిచ్చారు. సరే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు లేండి.

 

14 రోజుల రిమాండ్ తర్వాత అచ్చెన్న బెయిల్ తీసుకుని ఎలాగూ బయటకు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడుకునేదేమైనా ఉంటే అప్పుడే తీరుబడిగా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడే వైసిపి నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇఎస్ఐ కుంభకోణంలో అసలు సూత్రదారి లోకేషే అన్న విషయాన్ని అచ్చెన్న విచారణలో ఎక్కడ చెప్పేస్తారో అన్న టెన్షన్  చంద్రబాబులో పెరిగిపోతోందంటున్నారు. లోకేష్ ను దొంగలముఠా నాయకునిగా మంత్రి పేర్నినాని ఆరోపించటం గుర్తుంచుకోవాలి.

 

టిడిపి హయాంలో అవినీతికి పాల్పడిన వారంతా దోచుకున్న మొత్తంలో 60 శాతం చంద్రబాబు, లోకేష్ కే ఇచ్చారంటూ పేర్నినాని తీవ్రమైన ఆరోపణలను గుప్పించారు. దోపిడిలో తమ వాటా విషయాన్ని అచ్చెన్న ఎక్కడ బయటపెట్టేస్తాడో అన్న భయంతో, తమ పేర్లు బయటపెట్టకుండా ఉండమని బతిమలాడుకోవటానికే చంద్రబాబు, లోకేష్ మాజీ మంత్రిని కలిసే విషయంలో ఆతృత పడుతున్నట్లు వైసిపి నేతలంటున్నారు.  అచ్చెన్నను కలవాలని చూపిస్తున్న ఆతృత జేసి ప్రభాకర్ రెడ్డిని కలవటంలో చూపటం లేదన్న విషయం గమనార్హం. ఇక్కడే బిజెపి నేత సోమువీర్రాజు కూడా అప్రూవర్ ఆరోపణలు చేశాడు. అప్రూవర్ గా మారిపోతాడన్న భయంతోనే అచ్చెన్నను కలవటానికి చంద్రబాబు ఆతృత పడుతున్నట్లు సోము చెప్పాడు.

 

ఈ కారణంతోనే అందరిలోను చంద్రబాబు, లోకేష్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పైగా వైజాగ్ లో ఎల్జీ ప్రమాద బాధితులను కలిసే విషయాన్ని కూడా చంద్రబాబు పక్కన పడేశాడు. ప్రమాద బాధితులను కలవటానికి అడ్డురాని కరోనా వైరస్ సమస్య అచ్చెన్నను కలవటానికి అడ్డురాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: