ఏదైనా కోల్పాయాకే దాని విలువ తెలుస్తుందంటారు. ఇది జీవిత సత్యం. మరి కోల్పోక ముందే దాన్ని గుర్తించ గలిగితే.. ఇతరుల అనుభవాలను నుంచి మనం పాఠాలు నేర్చుకోగలిగితే.. జీవితంలో ఎన్నో ఆనందాలు కోల్పోకుండా ఉంటాం.. అందుకే మనం స్టీవ్ జాబ్స్ చివరి రోజుల్లో చెప్పిన ఈ జీవిత సత్యలు చదవి తీరాలి. మరణశయ్యపై స్టీవ్ జాబ్స్ చెప్పి ఈ విషయాలు మనకు ఆచరణప్రాయం.. స్టీవ్ జాబ్స్ తన జీవిత చరమాంకంలో ఆసుపత్రి మంచంలో ఉండి ఏం చెప్పారో.. చూడండి..

"వ్యాపార జగత్తులో శిఖరానికి చేరాను నేను... మీ అందరి దృష్టిలో నేను విజయానికి ప్రతీకను.. పని తప్ప వేరే ఆనందానికి నేను నోచుకోలేదు.డబ్బు ప్రపంచానికి అంకితం అయిపోయాను.. ఈ మరణశయ్య మీద చావును ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇన్నాళ్ళూ గర్వపడిన నా ధనిక ప్రపంచం ఎందుకూ కొరగానిదని నాకు అనిపిస్తోంది...

ఈ హాస్పిటల్ లో మిషన్ల శబ్దాలూ, పగలో రాత్రో తెలియకుండా వెలుగుతున్న లైట్లూ మధ్యలో నాకు యమధర్మరాజు శ్వాసల చప్పుడు వినిపిస్తోంది.  నాకిప్పుడనిపిస్తోంది..జీవితం చివరి వరకూ ఎంత డబ్బు అవసరమో అంతా సంపాదించాక మనం ఆలోచించవలసిన విషయాలు డబ్బు కాకుండా వేరే ఉన్నాయి .బహుశా అనుబంధాలూ, కళలూ , చిన్నప్పటి కలలూ, ఏదైనా సేవ .. డబ్బుకి ఆవల ఎంతో ముఖ్యమైన పనులున్నాయి. 

డబ్బు వెనుక పరుగు పెట్టడం మనిషిని వక్రంగా మార్చేస్తుంది. అందుకు నేనే ఓ ఉదాహరణ. భగవంతుడు మనకు ఇతరుల హృదయాలలోని ప్రేమను గుర్తించాలని జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. డబ్బును మాత్రమే గుర్తించే కాల్పానిక జగత్తును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బును నేను నాతో కూడా తీసుకు వెళ్ళలేను.నేను నాతో తీసుకు వెళ్ళేది ప్రేమానుభూతులను మాత్రమే . ఆ జ్ఞాపకాలు మాత్రమే !
 
ఇవే నీ కూడా ఉంటాయి . నీలో ఉంటాయి . నీతో పాటే ఉంటూ నిన్ను జీవించేలా చేస్తాయి. ఈ ప్రేమ పూర్వక అనుభూతులే నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి . జీవితం లో ఎదుగుదలను తెస్తాయి . అంతా నీ చేతులలో నీ హృదయం లోనే ఉంది. ఈ ప్రపంచం లో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా ? నువ్వు రోగం తో బాధ పడుతూ పడుకున్న మంచం.. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ని నియమించుకోగలవు . నీ కోసం సంపాదించిపెట్టే ఉద్యోగులను నియమించుకొగలవు.. నీ జబ్బును అనుభవించే వ్యక్తిని నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. 

నువ్వు దేన్నీ కోల్పోయినా తిరిగి పొందవచ్చు. కోల్పోయిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు. మనిషి ఆపరేషన్ రూం లోకి వెడుతున్నపుడు తెలుసుకుంటాడు . "ఆరోగ్యవంతమైన జీవితం" అనే పుస్తకం ఇంకా తాను చదవలేదని.. 
ఇపుడు మనం జీవితపు ఏ దశలో ఉన్నా.. తెర పడి పోయే రోజు ఒకటి ఉంటుంది . 
మిత్రమా !! 

నిన్ను నువ్వు ప్రేమించు. 
నీ కుటుంబాన్ని ప్రేమించు. 
నీ స్నేహితులను ప్రేమించు...
నిన్ను నువ్వు బాగా చూసుకో 
! ఇతరులను బాగా చూడు !.. "



మరింత సమాచారం తెలుసుకోండి: