స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర అమావాస్య తేదీ డిసెంబర్ 26 గురువారం 2019 న సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. "ధనస్సు" రాశి మూల నక్షత్రం "మకర , కుంభ" లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవించును.ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా , ఆస్ట్రేలియా ఖండాలలో కనబడును .

 

ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక , తమిళనాడు ,కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉండును .గ్రహణం సమయంలో సూర్యుడు అగ్ని వలయం లా గ్రహణం చుట్టూ కనిపిస్తాడు.

 

కేరళలోని చెరువుతూర్ లో సూర్యగ్రహణం అత్యంత సుందరంగా కనిపిస్తుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు ప్రవేశించడంతో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం సంభవించే సమయంలో అద్దాలు లేకుండా చూడవద్దని హెచ్చరిక... ఎవరైనా గ్రహణాన్ని గ్రహణం సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదని సూచన.

 

గర్భవతులు ఏలాంటి ఆందోళన చెందవలిసిన పని లేదు. గ్రహణం సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం చేయాలి. ఇష్టం దైవారాధన చేయాలి. 

 


గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా కడుక్కుని, స్నానం చేసే నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపుని, టీ స్పూన్ పచ్చి ఆవు పాలు, రెండు కర్పూరం బిళ్ళల పొడి వేసుకుని తలస్నానం చేయాలి.

 

ఆ తర్వాత ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేయాలి. శుభ్రమైన నీటిలో చిటికెడు పసుపు వేసి దేవుడి పాఠాలను శుభ్రం గా తుడిచి, బొట్లు పెట్టి, దీపారాధన చేసి బెల్లం తో చేసిన పరమాన్నం నైవేద్యం గా పెట్టాలి.
గ్రహణం తర్వాత మన ఇంటి ముందు రక్షణ కోసం కట్టిన గుమ్మడి కాయ, కొబ్బరికాయ శక్తి ని కోల్పోతాయి. కాబట్టి గ్రహణం తర్వాత ఇంటికి గాని వ్యాపార సంస్థ కి గాని గుమ్మడికాయని శాస్త్రోత్మకంగా పూజ చేయించుకుని ఇంటి ముందు కట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: