సంక్రాంతి పేరు వినగానే ముందుగా అందరికీ కోడి పందాలే గుర్తుకు వస్తాయి. ఆ తరువాతే పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పల్లెల్లో హడావిడి, గంగిరెద్దులు వగైరా వగైరా ఎవన్నా సరే. పండుగ ఇంకా రెండు నెలలో మొదలవుతోంది అంటేనే కోడి పందాల పై క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక పక్క కోడి పందాలు నిర్వహించాలని ఒక వర్గం , మరో పక్క నిర్వహించ కూడదని జంతు సంక్షేమ కార్యకర్తలు ఇలా ఎవరి వాదనలు వారివి. కానీ చిట్ట చివరికి కోడి పందాల నిర్వాహకులే తమ పంతం నెగ్గించుకుంటారు.

 

అసలు ఈ కోడి పందాలు ఎక్కడి నుంచీ వచ్చాయి, వీటిని ఎవరు కనుగొన్నారు. మన సంక్రాంతి పండుగలో ఓ భాగం ఎలా అయ్యాయి అనే వివరాలు చాలా మందికి తెలియదు. వాస్తవానికి కోడి పందాలు మన సంస్కృతి లో భాగం కాదు. సుమారు 6000 వేల ఏళ్ళ క్రితం అరబ్ దేశాలలోని పర్షియాలో మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. ఈ సంస్క్రతిని మెల్ల మెల్లగా వివిధ దేశాలకి పాకిందని ఆ కారణంగానే భారత్ లో సైతం ఈ అలవాటు సంస్కృతిగా మారిందని తెలుస్తోంది. ఈ అలవాటులో భాగంగానే ప్రతీ సంక్రాంతి పండుగకి ఇవి మన సంస్కృతిలో భాగం అయ్యిపోయాయి.

 

వాస్తవంగా కోడి పందాలు పూర్వం ఏ ఉద్దేశ్యంతో నిర్వహించే వారంటే.. వివిధ దేశాలో రాజులు యుద్దాలకి వెళ్ళే ముందు కోడి పుంజులకి శత్రువుల పేర్లు పెట్టి వాటితో పందాలు వెసేవారట. దానిలో శత్రువు పుంజు చనిపోతే యుద్దానికి సిద్ధమయ్యేవారని, ఒక వేళ శత్రువు పుంజు గెలిస్తే యుద్దానికి కొంత సమయం తీసుకునే వారని ఈ క్రమంలోనే ఈ పందాలు మొదలయ్యాయని చరిత్ర కారులు చెప్తున్నారు. అయితే ఈ సంస్కృతీ రాను రాను విష సంస్కృతిగా మారిపోయింది.

 

ఇక తెలుగు రాష్ట్రాలలో కోడి పందాలపై ప్రత్యేక శ్రద్ద సుమారు 11 వ శతాబ్దపు కాలంలోనే చూపించే వారట. బాలనాగమ్మతో పందంలో ఒడిన బ్రహ్మనాయుడు అడుపులకి వెళ్ళిన చరిత్ర కూడా మనకి తెలిసిందే. అప్పట్లో మన దేశపు రాజులకి పరాయి దేశ రాజులకి మధ్య కూడా కోడి పందాలు జరిగేవట. తరువాతి కాలంలో ఈ పందాలు ఉత్తర ఆంద్ర నుంచీ, గోదావరి జిల్లాలకి వచ్చింది.ఇక కోడి పందాలు అనగానే పశ్చిమ, తూర్పు గోదావారి జిల్లాల పేర్లు బలంగా వినిపిస్తాయి. ముఖ్యంగా

 

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ కోడి పందాల నిర్వహణ భారీగా జరుగుతుంది. కొట్లలో పందాలు, గుండాటలు నిర్వహణ, జిల్లాలో లెక్కకి మించిన బిరులు తో సాగే ఈ క్రీడ కోడి పందాలుగా కాదు జూద కేంద్రాలుగా మారిపోతున్నాయి. పార్టీ ఏటా ఈ కోడి పందాల పేరు చెప్పి ఆర్థికంగా నష్టపోయే వాళ్ళు ఎంతో మంది  ఉన్నారు. చిన్నతనం నుంచీ జీవ హింస గురించి నేర్చుకునే ప్రజలు కోళ్ళకి కత్తులు కట్టి మరీ వాటి రక్తాన్ని కళ్ళ చూసిన తరువాత గాని ఇంటికి వెళ్ళరు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: