ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. శ్రీశైలానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పరమేశ్వరుని దివ్య ధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మల్లిఖార్జున స్వామి, భ్రమరాంభికా దేవి ఈ క్షేత్ర మూలవిరాట్టులు. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివ పార్వతుల విగ్రహాలు ఉంటాయి. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున హిందువులు ఈ దేవాలయానికి ప్రాముఖ్యత ఇచ్చి దర్శనం చేసుకుంటారు. 
 
 
భక్తులు శ్రీశైలంలోని కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ద్రవిడ, వాస్తు శిల్ప కళా సాంప్రదాయాల ప్రకారం ఈ ఆలయం నిర్మింపబడింది. క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన శాతవాహన రాజులు శ్రీశైల ఆలయం గురించి ప్రస్తావించారు. వాస్తు శిల్పకళ పరంగా, మతపరంగా చారిత్రకంగా ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 
 
విజయనగర రాజులు, కాకతీయులు ఈ ఆలయానికి చాలా కానుకలిచ్చారు. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ భక్తుల కోసం వసతిగా అతి పెద్ద కాటేజీలు, హోటల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కుల ప్రాతిపదికన ఒక సత్రం నిర్వహింపబడుతున్నది. శివరాత్రి పర్వదినములు, కార్తీక మాసము నందు తప్ప మిగిలిన అన్ని రోజులలో ఏ సత్రములోనైనా ఎవరికైనా వసతి లభిస్తుంది. 
 
శ్రీశైలంకు చుట్టుపక్కల తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో సాక్షి గణపతి ఆలయం, శ్రీశైల శిఖరం, పాలధార, పంచధారలు, ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, భీముని కొలను తప్పక చూడాల్సిన ప్రదేశాలు. కర్నూలు నుంచి బస్సు మార్గం ద్వారం ద్వారా శ్రీశైలానికి చేరుకోవచ్చు.         

మరింత సమాచారం తెలుసుకోండి: