హిందూ పూజ విధానంలో దీపారాధన చాలా ముఖ్యమైంది. మనం చేసే ఏ పూజకైనా దీపాలు వెలిగిస్తే కానీ ఆ పూజకు పరిపూర్ణత రాదు. కొందరు ప్రస్తుతనం ఉన్న బిజీ జీవితంలో  పూజను నూతన విధానం ప్రకారం చేయలేని వారు కేవలం దేవుని ముందు ఏదైనా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి ఆ దేవునికి  నమస్కరించుకుని తిరిగి వారి పనులకోసం పరుగులు తీస్తుంటారు. అసలు దేవుని ముందు దీపం ఎందుకు పెట్టాలి అంటే మానవుని శరీరము పంచభూతాల సమాహారమని అంటుంటారు ...ఇక దీపం వెలిగించడం అంటే మనల్ని మనం వెలిగించుకొనడమే అవుతుంది. తద్వారా మనలోని అజ్ఞానాన్ని దహించి..ఆ దేవుని కృపతో జ్ఞానాన్ని పొందడమే అవుతుంది.

ఇక దీపారాధన చేసేటప్పుడు చాలా మంది ముందుగా వత్తి వేసి ఆ తర్వాత అందులో  నూనెను పోస్తుంటారు. కానీ ఇలా చేయకూడదని ముందు నూనెను దీపం కుంతెలో పోసి ఆ తర్వాతనే వత్తిని వేసి దీపారాధన చేయాలని చెబుతున్నారు వేద పండితులు. అలాగే ప్రతి రోజు పూజ సమయానికి దీపారాధన చేసే కుందీలను శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అలా కాకుండా కుందిని కడుగకుండా కేవలం ఒత్తులను మార్చడం పూజ విధానం కాదు. అదేవిధంగా దీపారాధన చేసిన అనంతరం దీపపు కుందీని ఏదైనా కంచు ప్లేట్ లో కానీ లేదా తమలపాకుపై కానీ ఉంచాలి. అంతేకాని ఏ ఆధారం లేకుండా అలా వదిలేయరాదు. దీపం కుందెకు ఎలా అయితే మనం ఆధారం పెడతామో మన జీవితాలకు కూడా ఆ దేవుడు ఆధారాన్ని ఏర్పరుస్తారు అన్నది ఇక్కడ వివరణ.


అలాగే దీపారాధన చేసే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన  అంశం...దీపారాధనను చాలా మంది నేరుగా అగ్గిపుల్ల వెలిగించి చేస్తుంటారు. కానీ ఇది సరైన పూజ విధానం కాదంటున్నారు పురోహితులు. ముందుగా కొవ్వొత్తిని వెలిగించి ...ఆ కొవ్వొత్తితో దీపాన్ని వెలిగించాలి. ఇక ఎప్పుడు దీపారాధన అయినా అనంతరమే కర్పూరాన్ని వెలిగించాలి. దీపారాధన చేసే  స్త్రీలు సౌభాగ్యవతులు అయితే ఖచ్చితంగా నుదుటున సింధూరం ధరించాలి. దీపాలు వెలిగే సమయంలో వత్తి దేవుని వైపుగా..వెలుపలకు  ఉండాలి. దీపారాధనను ఆవు నెయ్యితో చేస్తే సకల శుభాలు, సంతోషాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: