భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు మహేంద్ర సింగ్ ధోని. 2004 లో ఇండియన్ క్రికెట్ టీం లో చోటు సంపాదించిన ధోని, తనదైన ఆట తీరుతో తోటి ఆటగాళ్లను, సెలెక్టర్లను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ధోని క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.