ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతుండడం తో దాని ప్రభావం క్రీడా రంగంపై పడింది. కరోనా వల్ల ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనుకున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మధ్యలోనే రద్దయింది. ఇక కరోనా సెగ వల్ల తాజాగా టీమిండియా- సౌతాఫ్రికాల మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ కూడా వాయిదా పడింది. ఈసిరీస్ లో మొదటి మ్యాచ్  వర్షం వల్ల రద్దు కాగా కరోనా భయంతో మిగితా రెండు వన్డేలను బీసీసీఐ క్యాన్సల్ చేసింది. అయితే ఈ సిరీస్ పూర్తిగా రద్దు కాలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తో చర్చించి మళ్ళీ నిర్వహించనున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈఏడాది చివర్లో ఈ సిరీస్ జరిగే అవకాశాలు వున్నాయి. 
 
ఇక ఈ సిరీస్ వాయిదా పడడం తో టీమిండియా తదుపరి అంతర్జాతీయ సిరీస్ ను శ్రీలంక తో ఆడనుంది. అందులో భాగంగా జూన్ లో భారత్, శ్రీలంక లో పర్యటించనుంది. ఈపర్యటన లో ఆతిథ్య జట్టు తో టీమిండియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తోపాటు మూడు మ్యాచ్ ల టీ 20ల సిరీస్ లో కూడా తలపడనుంది. ఇదిలావుంటే ప్రస్తుతం సొంత గడ్డపై శ్రీలంక ,ఇంగ్లాండ్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తలపడాల్సివుంది. అయితే కరోనా దెబ్బ తో అర్ధాంతరంగా సిరీస్ ను రద్దు చేసుకొని ఇంగ్లాండ్ స్వదేశం పయనమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: