ఈ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరగవలసిన టి20 ప్రపంచ కప్ పై ఐసీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఈ టోర్నీని వాయిదా వేయడమే మంచిది అని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై వచ్చే వారంలో అనుబంధ బోర్డుతో ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తరువాత ఈ విషయంపై అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సమావేశంలో దీనితో పాటు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

 

అలాగే ఈ నెల ఆఖరి తో ఐసీసీ చైర్మన్ పదవి కాలం ముగింపు  అవుతూ ఉండడంతో ఈ పదవి పై కూడా ఆ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి అని తెలుస్తుంది.మరోవైపు టి20 ప్రపంచ కప్ వాయిదా పై ఆదిత్య క్రికెట్ ఆస్ట్రేలియా కూడా మద్దతు పలికే లాగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఖాళీ స్టేడియంలో ఈ టోర్నీని నిర్వహిస్తే భారీ ఎత్తున టికెట్టు రెవెన్యూ తగ్గిపోతుంది అలాగే నష్టపోతాము అని సిఏ భావిస్తోంది.అలాగే ఈ తరుణంలో టోర్నీని ఎప్పుడు నిర్వహించాలో అనే విషయంపై ఐసీసీ మూడు రకాలుగా ఆలోచిస్తూ ముందుకు కొనసాగుతుంది.మొదటి ప్రయత్నం గా ఈ టోర్నీ ఫిబ్రవరి నెలలో నిర్వహించాలని ఐసిసి భావిస్తుంది దీనిపై కూడా ఆస్ట్రేలియా సుముఖంగానే ఉంది అనే చెప్పాలి. అని అదే సమయంలో భారత్ ఇంగ్లాండ్ సిరీస్ ఉండటంతో కాస్త అభ్యంతరం వ్యక్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 ఇక రెండో ప్రయత్నంగా 2021 లో జరిగే టోర్నీని ఆసిస్ లో, 2022 జరగబోయే టోర్నీని భారత్లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తుంది. ఈ విషయంపై కూడా భారత్ బోర్డు రెడ్డి సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక చివరిగా మూడో ప్రయత్నం గా 2022 లో టోర్నీని నిర్వహించేందుకు దృష్టి మళ్లించింది.ఆ సంవత్సరంలో ఐసీసీ టోర్నీ కూడా లేకపోవడంతో ఇదే మంచి సమయం అని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఐసిసి టీ20 ప్రపంచ కప్ ఒకవేళ నిర్వహిస్తే అక్టోబర్ లో భారత్లో నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: