ప్రపంచ దేశాలన్నింటిలో భారత దేశానికి విశిష్ట స్థానం ఉంది. క్రీడారంగంలో భారత్ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్ కు క్రీడల పట్ల గట్టి చరిత్రే ఉంది. అయితే ఒలంపిక్స్ వంటి వాటిల్లో భారత క్రీడాకారులు పాల్గొన్నది తక్కువే. అందుకోసమే భారత క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటూ భారతదేశ స్థాయిని పెంచేందుకు పాటుపడుతున్నారు. భారత దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడారంగం వైపు తీసుకెల్లడం లేదు. ప్రధానంగా వారు చదువులో రాణించకపోవడంతో క్రీడలపట్ల ఆసక్తిని చూపినప్పటికీ వారు పిల్లలను ఆ దిశగా కదిలించడం లేదు. అయితే క్రీడలలో రాణిస్తే మన దేశంలో ఎక్కువగా గుర్తింపు ఉండటం లేదు. ప్రోత్సాహాలు కరువైపోతున్నాయి. అంతేకాదు ఆదుకుంటామని చెప్పే నాయకులే చేతులెత్తేస్తున్నారు. అందుకే భారత్ లో క్రీడాకారులకు సరైన గౌరవ మర్యాదలు లేవని చెప్పొచ్చు. క్రీడాకారులకు ప్రోత్సాహం తక్కువైనప్పటికీ భారత దేశ స్థాయిని పెంచడం కోసం కొందరు శిక్షణనిచ్చి ఒలంపిక్స్ కు ప్రిపేర్ చేస్తున్నారు.  క్రీడల్లో కొందరు మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వారు సరిగా జీవించలేకపోతున్నారు. వారి జీవనాధారం భారమైపోతోంది.

ప్రభుత్వ సాయం లేకపోవడం వల్ల వారి కుటుంబం వీధిన పడుతోంది. గత్యంతరం లేక వారు వేరే పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఓ క్రీడాకారిని పరిస్థితి కూడా ఈ విధంగానే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పతకాలు సాధించిన హర్దీప్‌ కౌర్‌ కూలీగా మారిపోయింది. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కూలీగా మారి పనులు చేసుకుంటోంది. పంజాబ్‌ లోని మన్సా జిల్లా గుర్నేకాలాన్‌ కు చెందిన 23 ఏళ్ల హర్దీప్‌ మంచి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. పతకాలు సాధించి పేరుప్రఖ్యాతలు సాధించింది. అయితే తన కుటుంబాన్ని పోషించేందుకు కూలీగా మారి పనులు చేసుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటి వరకూ ఆమె దాదాపు 20 పతకాలను సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అటువంటి ఆమెకు ప్రభుత్వ సాయం కొరవడటం వల్ల కూలీగా మారే పరిస్థితి దాపురించింది. 2018లో మలేషియాలో జరిగిన పోటీల్లో స్వర్ణం సాధించింది. ఆ టైంలో హర్దీప్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆ టైంలో ఉణ్న పంజాబ్‌ క్రీడామంత్రి రాణా గుర్మీత్‌ తెలిపారు. ఆ హామీని ఆ తర్వాత నెరవేర్చలేదు. దీంతో ఆమె కూలీగా మారి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: