ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది . సెప్టెంబర్ 3వ తేదీ నుంచి శ్రీలంక వేదికగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తమ క్రికెటర్గా మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడాలని అనుకున్న పాకిస్థాన్ కి ఊహించని షాక్ తగిలింది.
ఆఫ్ఘనిస్థాన్లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా పాకిస్థాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తో ఎలాగైనా సిరీస్ ఆడాలని భావించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వర్చువల్ సమావేశమయ్యాయి. ఇక ఈ సమావేశంలో పాకిస్థాన్లో మూడు వన్డేల సిరీస్ ఆడటానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకారానికి కూడా వచ్చాయి. కానీ చివరికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది. వన్డే సిరీస్ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ పాలనలో తమ దేశ క్రికెట్ కు ఎలాంటి నష్టం జరగకూడదు అని ఆశిస్తున్నాము అంటూ ప్రస్తుతం క్రికెట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి