ఇక ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. నవంబర్ 11వ తేదీనా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగబోతోంది. అయితే టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు చూసుకుంటే ఒక్కసారి కూడా ఓటమి పాలు కాకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది పాకిస్థాన్ జట్టు. అదే సమయంలో అటు ఆస్ట్రేలియా కూడా అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి. దీంతో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.. అయితే ఆస్ట్రేలియా తో మ్యాచ్ కి ముందు అటు పాకిస్తాన్ జట్టు కి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్నారు మహమ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్. ఇక ఇద్దరు స్టార్ ప్లేయర్ లు కూడా ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజుల నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారట ఇద్దరు క్రికెటర్లు. అయితే వీరిద్దరికీ ఐసీసీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది. కాగా ఇటీవలే ప్రాక్టీస్ సెషన్ కి దూరమయ్యారు ఇద్దరు ఆటగాళ్ళు.. దీంతో ఇద్దరూ ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు లో చేరుతారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవేళ ఆస్ట్రేలియాతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్లు అందుబాటులో లేరు అంటే అది పాకిస్థాన్ జట్టుకు ఎంతో మైనస్ అయ్యే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి