క్రికెట్లో కెప్టెన్ గా కొనసాగుతున్న వ్యక్తి ఎప్పుడూ ఎంతో అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ఒకవైపు జట్టును ముందుకు నడిపించడమే కాదు మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా కూడా మారిపోవాలి. ఇవేవీ జరగలేదు అంటే క్రికెట్ బోర్డు అతని జట్టు కెప్టెన్సీ నుంచి జట్టు నుంచి తప్పించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే ఇలా ఒక ఆటగాడిగా కెప్టెన్గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ క్రికెట్ జట్టు గా కొనసాగుతుంది ఇంగ్లాండ్. ఇప్పటివరకు ఎన్ని రికార్డులు సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్ లో  ఛాంపియన్ జట్టుగా కొనసాగుతోంది.


 అలాంటి ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆడిన టెస్టు సిరీస్ లో ఘోరంగా పరాజయం పాలైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్ఠాత్మకమైన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ఆడింది  ఇక ఈ ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో కనీసం ఆస్ట్రేలియా జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది ఇంగ్లాండ్ జట్టు. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి చవి చూసి మరో రెండు మ్యాచ్లు మిగిలి వుండగానే సిరీస్ను కోల్పోయి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఒక రకంగా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కెప్టెన్ జో రూట్  పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి.


 ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా పరాభవం తర్వాత అటు జో రూట్ ను కెప్టెన్గా తొలగించాలి అంటూ ఎన్నో డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జో రూట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు జట్టుకు కెప్టెన్గా తానే సరైన వ్యక్తిని అంటూ జో రూట్ తెలిపాడు. ఒకవేళ నా నుంచి కెప్టెన్సీ తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం తీసుకోండి కానీ నేను మాత్రం కెప్టెన్గా కొనసాగాలి అని అనుకుంటున్నాను అంటూ జో రూట్ తెలిపాడు. కాగా ఇప్పటివరకు ఒక్క సారి కూడా జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ గెలవలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: