ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే నేడు చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడి ఓటమితో భంగపాటుకు గురయ్యాయి. కోల్కత నైట్ రైడర్స్ లో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవిచూసింది. ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో  జట్టు ఓడిపోయింది. దీంతో ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్ లో భోణి కొట్టలేదు  అని చెప్పాలి.


 ఇక ఈ రెండు జట్ల కు కూడా ప్రస్తుతం సరికొత్త కెప్టెన్లు జట్టును ముందుకు నడిపిస్తున్నారు. మొన్నటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ ఇక ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించి చివరికి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో జడేజా క్యాప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక అటు ఐపీఎల్ లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కె.ఎల్.రాహుల్. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కూడా తమ జట్టుకు విజయాన్ని అందించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.



 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగబోయే మ్యాచ్ ముంబై లోని బ్రబోర్న్   స్టేడియంలో జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. సాయంత్రం ఏడున్నర గంటలకు ఇక ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు అని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన ఈ రెండు జట్లు ఇక రెండో మ్యాచ్లో మాత్రం తప్పకుండా గెలవాలని అనుకుంటున్నాయ్. మరి గెలుపు తలుపు ఎవరిని తడుతుంది అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: