ఈ క్రమంలోనే వరుస ఓటములతో సతమతమవుతూ ఉంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇప్పుడు వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేక పోయింది అని చెప్పాలి. ఈ సీజన్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు అన్నింట్లో కూడా ఓడిపోయింది. దీంతో మొన్నటివరకు ముంబై గెలుస్తుంది. మళ్లీ పుంజుకుంటుంది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇక ఇప్పుడు మాత్రం ముంబై ఏడో ఓటమి తర్వాత గోవింద గోవింద అని అంటున్నారు.
ఈ సీజన్ దేవుడికి ఇచ్చేశాం ఇక వచ్చే సీజన్లో చూసుకుందాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమితో ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. ఇక వరుసగా మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుకోలేదు. అయితే ఇప్పుడు ముంబై ఫామ్ చూస్తే వరుసగా గెలవడం కూడా కష్టం అని చెప్పాలి. అందుకే అభిమానులు అందరూ కూడా గోవిందా గోవిందా అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి