ముంబై ఇండియన్స్ ఈ ఏడాది కలలో కూడా ఊహించని విధంగా పేలవ ప్రదర్శన చేసింది. అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి గా పిలువబడే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ఆ జట్టును కూడా ఇంటి బాట పట్టేలా చేసింది ముంబై ఇండియన్స్. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తో రోహిత్ సేనా ఒక అద్భుతమైన రికార్డును సాధించడం గమనార్హం.


 భారత్ పాకిస్తాన్  లాగే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్  చిరకాల ప్రత్యర్థులు అని చెబుతూ ఉంటారు. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడూ  మ్యాచ్ జరిగిన ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ప్రేక్షకులందరూ ఎంత ఉత్కంఠ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇక చెన్నైతో మ్యాచ్ అంటే చాలు రోహిత్ శర్మ కూడా తప్పకుండా గెలవాలన్న కసితో కనిపిస్తూ ఉంటాడు. కేవలం చెన్నైతో మాత్రమే కాదు 2 సార్లు ఐపీయల్ టైటిల్ విజేత అయినా కోల్కత నైట్రైడర్స్ మ్యాచ్ అయినా కూడా రోహిత్ శర్మ గెలవాలన్న కసితో నే కనిపిస్తూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఈ రెండు జట్ల పై అద్భుతమైన విజయాలు సాధించి  ఆసక్తికర రికార్డును సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్,  కోల్కతా నైట్రైడర్స్ పై 20 సార్లు అంతకన్నా ఎక్కువ విజయాలు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకు కూడా ఈ రికార్డు లేదు అనే చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ముప్పై నాలుగు సార్లు ఆడితే ఇందులో 20 సార్లు విక్టరీని అందుకుంది ముంబై. కోల్కతా నైట్ రైడర్స్ లో ఇప్పటి వరకు 31 సార్లు తలపడితే 22 సార్లు పైచేయి సాధించడం గమనార్హం. ఇలా ఈ రెండు జట్ల పై 20 కంటే ఎక్కువ విజయాలు సాధించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: