ఆస్ట్రేలియా క్రికెట్ లో ఎన్ని ఏళ్ళ పాటు అద్భుతమైన సేవలు అందించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆండ్రూ సైమండ్స్  ఇటీవలే అకాల మరణం చెందారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదం బారిన పడటంతో తీవ్ర గాయాలపాలైన  సైమండ్స్ చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆండ్రూ సైమండ్స్ మరణవార్త వినగానే అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.. ఇక రెండు నెలల వ్యవధిలోనే షేన్వార్న్,  ఆండ్రూ సైమండ్స్ లాంటి కోల్పోవడంతో ఆస్ట్రేలియా క్రికెట్ లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది.


 ఈ క్రమం లోనే ఆండ్రూ సైమండ్స్ మృతిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అతనితో తమకున్న అనుభవాలను అనుబంధాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.ఈ క్రమం లోనే ఉదయం లేవగానే ఆండ్రూ సైమండ్స్ మరణ వార్త షాక్ కు గురిచేసింది అంటూ అందరూ సోషల్ మీడియాలో ఆండ్రూ సైమండ్స్ మరణానికి సంతాపం తెలియజేశారు అనే చెప్పాలి. ఇకపోతే ఇక ఆండ్రూ సైమండ్స్ మృతదేహాన్ని ఆయన ఇంట్లో సందర్శనార్థం ఉంచి ఇక ఇటీవలే అంత్యక్రియలు నిర్వహించారు.


 ఇలా ఆండ్రూ సైమండ్స్ అంత్యక్రియలు జరుపుతున్న సమయం లో అందరి హృదయాలను కదిలించే ఒక ఘటన చోటు చేసుకుంది.  సైమండ్స్ ఎంతో ప్రేమగా రెండు కుక్కపిల్లలు పెంచుకున్నారు. ప్రమాదం జరిగిన సమయం లో అతనితో పాటు ఇక పిల్లలు ఉన్నప్పటికీ ఎలాంటి గాయాల బారిన పడకుండా బయట పడ్డాయి. అయితే ఇందులో కుక్కపిల్ల మాత్రం  సైమండ్స్ అంత్యక్రియలు నిర్వహిస్తుంటే ఏకంగా మృతదేహం వెంటే వెళ్లిందట. ఆండ్రూ సైమండ్స్ ను వదిలేందుకు అసలు ఇష్టపడలేదట. ఆయన మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అటు వైపు వెల్లిందట. చివరి అంత్య క్రియల వరకు అక్కడే దిగాలుగా కూర్చుని ఉండడం చూసి అక్కడున్న వారి గుండె తరుక్కు  పోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: