ప్రపంచ క్రికెట్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా తో తలపడి నిలిచి గెలవడం అంటే అది మామూలు విషయం కాదు అనే చెప్పాలి.  కేవలం అత్యుత్తమమైన ఆటగాళ్లతో బరిలోకి దిగినప్పుడు ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ఇప్పుడు శ్రీలంక జట్టు ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికింది అని చెప్పాలి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన విజయాన్ని సాధించింది. దీంతో ఇక శ్రీలంక క్రికెట్ అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు అనే చెప్పాలి.


 ఒకప్పుడు ముత్తయ్య మురళీధరన్, మలింగా, సంగక్కర, జయవర్ధనే లాంటి కీలక ఆటగాళ్లతో అటు శ్రీలంక జట్టు ఎంతో పటిష్టంగా ఉండేది. దీంతో శ్రీలంకతో మ్యాచ్ అంటే చాలు అటు ప్రత్యర్థి పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకునేవారు అని చెప్పాలి.  కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం శ్రీలంక జట్టు లో నాణ్యత లోపిస్తూ వచ్చింది. దీంతో అద్భుతమైన విజయాలు సాధించడం శ్రీలంకకు చాలా కష్టం గానే మారిపోయింది. అయితే దిగ్గజ క్రికెటర్లు ఉన్న సమయంలో శ్రీలంకకు టి20 వరల్డ్ కప్ వచ్చింది కానీ సొంతగడ్డపై మాత్రం ఒక్క సిరీస్ కూడా గెలవలేక పోయింది అని చెప్పాలి. ఇక సీనియర్లు రిటైర్ అయిన తర్వాత శ్రీలంక పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది.


 కానీ ప్రస్తుతం మాత్రం శ్రీలంక జట్టు అద్భుతంగా రాణిస్తోంది. యువ ఆటగాళ్లతో చిచ్చరపిడుగులా దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డుల్ని యువ ఆటగాళ్లు సాధించారు. సొంతగడ్డపై దిగ్గజ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 3-1 తేడాతో ఆధిక్యం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది శ్రీలంక జట్టు. దీంతో 30 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక ఈ అద్భుత విజయం తర్వాత అయినా శ్రీలంక జట్టుకు పూర్వవైభవం వస్తుంది అని అటు శ్రీలంక అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక శ్రీలంక సాధించిన అద్భుత విజయం పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: