టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో ఇక టీమిండియా ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేశాడు అని చెప్పాలి. ఏకంగా 107 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు రిషబ్ పంత్. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే ఎవరైనా సరే ఆచితూచి ఆడుతూ ఉంటారు.
దూకుడుగా ఆడకుండా నెమ్మదిగా ఆడుతూ పరుగుల సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రిషబ్ పంత్ మాత్రం తాను ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు. ఎందుకంటే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు. టి20 ఫార్మట్ తరహాలో వీరవిహారం చేశాడు. అంతేకాదు మొన్నటి వరకు పేలవా ఫామ్లో ఉన్న రిషబ్ పంత్ ను విషయం పక్కన పెట్టాలి అంటూ చెప్పినవారికి తన బ్యాట్ తోనే సాలిడ్ సమాధానం ఇచ్చేసాడు రిషబ్ పంత్. ఇక ఇటీవల రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎంతో కీలకం గా మారిపోయింది అని చెప్పాలి. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి