సాధారణంగా ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య స్లెడ్జింగ్ పాల్పడటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇరు జట్ల ఆటగాళ్లు కవ్వింపు లకు   పాల్పడినప్పుడు మ్యాచ్ మరింత రసవత్తరంగా మారుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కాగా భారత జట్టు ఇంగ్లండ్ వేదికగా ఆడుతున్న రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలా జరిగింది. అప్పటికే ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న బెయిర్ స్టో ను  స్లీడ్జింగ్ కి పాల్పడ్డాడు కోహ్లీ.  వీరిద్దరి మధ్య చాలా సేపటి వరకూ కూడా మాటల యుద్ధం జరిగింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మాటల యుద్ధం తర్వాత కోపంతో ఊగిపోయిన బెయిర్ స్టో ఆ కోపాన్ని మొత్తం తన బ్యాటింగ్ లో చూపించాడు. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవేళ విరాట్ కోహ్లీ బెయిర్ స్టో తో వివాదం పెట్టుకోక పోయి ఉంటే సెంచరీ చేసే వాడు కాదేమో అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై స్పందించిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల టెస్ట్ మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ అనవసరమైన స్లెడ్జింగ్ పాల్పడ్డాడు.


 బెయిర్ స్టో తో కోహ్లీ మాటల యుద్ధానికి దిగడం అతన్ని రెచ్చగొట్టింది అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకు ముందు వరకు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే కోహ్లీ అతన్ని గెలికాడో తనలోని ఫైర్ బయటపెట్టి పరుగులు చేశాడు. ఇది మానవ సహజం కూడా అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. స్లీడ్జింగ్ అటు బెయిర్ స్టో కి ఎంతగానో కోపం తెప్పించింది. వేర్బెయిర్ స్టో రాణించిన భారత బౌలర్లు మాత్రం బాగా పట్టు బిగించారు అంటూ ప్రశంసలు కురిపించాడు వసీం జాఫర్. అయితే కోహ్లీతో వివాదం ముందు వరకూ కూడ 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసిన బెయిర్ స్టో కోహ్లీ మాటల యుద్ధం తరువాత 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: