ఎవరైనా ఒక యువ హీరోకి ఒక హిట్ పడగానే ఏకంగా అంచెలంచెలుగా ఎదిగిన  చిరంజీవి తో పోల్చడం ఎంత తప్పో... ఇక క్రికెట్లో ఒక సాలిడ్ ఇన్నింగ్స్ పడగానే పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తో పోల్చడం కూడా అంతే తప్పు అనే చెప్పాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫాంలో లేని సమయంలో ఒక వైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం అదరగొడుతున్నాడు.  ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇద్దరిలో ఎవరు గ్రేట్ అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ సాధించిపెట్టిన ఎన్నో రికార్డులను బాబర్ తిరగరాస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 3 ఫార్మాట్లలో కూడా టాప్ లో కొనసాగుతూ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల బాబర్ అజాం అద్భుతమైన ఫామ్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బాబర్ పై  ప్రశంసలు కురిపించాడు. అయితే బాబార్ ను  పొగిడితే పొగిడాడు కానీ విరాట్ కోహ్లీని తక్కువ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం మాత్రం కోహ్లీ ఫాన్స్ కి అస్సలు నచ్చడంలేదు. సారీ ఇండియన్ ఫ్యాన్స్.. కానీ బాబర్  కవర్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కంటే బాగుంటుంది. కోహ్లీ స్టైల్ కంటే బాబర్ కవర్ డ్రైవ్ స్టైల్ ఇంకా బాగుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 కవర్ డ్రైవ్ ఆడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ చేతిని ఎక్కువగా వంచుతాడు అంటూ చెప్పిన నాసర్ హుస్సేన్ బాబర్ మాత్రం ఓల్డ్ లవ్లీ టచ్ ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నేటి తరం కుర్రాళ్ళు అందరికీ కూడా కవర్ డ్రైవ్ గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే బాబర్ ఆడే కవర్ డ్రైవ్ ని చూపిస్తానంటూ షాకింగ్ కామెంట్ చేశాడు నాసర్ హుస్సేన్. అయితే నాజర్ హుస్సేన్ కామెంట్లతో అటు బాబర్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఎదురు దాడికి దిగుతోన్నారు.  కోహ్లీతో పోల్చడం అంటే క్రికెటర్ కి ఒక స్థాయి ఉండాలని.. బంగ్లాదేశ్ జింబాబ్వే లాంటి చిన్న జట్లపై సెంచరీలు చేసే చిన్న ఆటగాడు బాబర్ అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: