టీమిండియాలో అసలుసిసలైన నిఖార్సైన   ఆల్రౌండర్గా పేరు సంపాదించుకున్నాడు రవీంద్ర జడేజా. ఆల్ రౌండర్ అంటే రవీంద్ర జడేజా లాగే ఉండాలేమో అని ప్రతి ఒక్కరూ అనుకునేంతలా తన ఆటతీరుతో ప్రభావితం చేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే బౌలింగ్ లో కీలక సమయంలో వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు. అంతేకాదు మైదానంలో పాదరసంలా కదులుతూ తనకు ఎవరు సాటి లేరు అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు రవీంద్ర జడేజా.


 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో మూడు ఫార్మాట్లలో కూడా రవీంద్ర జడేజా ఎంతో కీలక ఆటగాడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అలాంటి రవీంద్ర జడేజా టీమిండియా జట్టును కష్టాల్లోకి నెట్టాడు.  మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర జడేజా చివరికి జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ జరగడంతో చివరికి ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఇక టి20 వరల్డ్ కప్ కి కూడా అతను అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.  రవీంద్ర జడేజా గాయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది అనేది మాత్రం తెలుస్తుంది.



 ఇకపోతే ఇటీవల రవీంద్ర జడేజా చేసిన పోస్ట్ కాస్త అభిమానులందరి లో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాను అంటూ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు కాలుకు పట్టితో కర్ర సహాయంతో కనిపించిన జడేజా ఇటీవలే ఒక ఫోటో షేర్ చేస్తూ రీస్టార్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజా త్వరగా ఫిట్ అవ్వాలని జట్టులోకి రావాలి అంటూ నెటిజన్లు కామెంట్స్  చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ పోస్టు చూసి అభిమానులు అందరూ కూడా తెగ ఆనందపడి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: