టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. అతను కెప్టెన్సీలో లేకపోయినప్పటికీ జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ.. మొన్నటి వరకు బాగా ఆడలేక సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కోహ్లీకి ఉన్న క్రేజ్ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పాలి . కొన్నాళ్ల నుంచి సరిగా ఆడకపోయినా అతని క్రేజ్ మాత్రం రెండింతలు అయింది అని చెప్పాలి.  సోషల్ మీడియాలో ప్రపంచ క్రికెట్లో అందరికంటే ఎక్కువగా పాపులారిటీ కలిగిన క్రికెటర్ గా ఇటీవల ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు విరాట్ కోహ్లీ.


 ఇక సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ అన్నింటిలో కూడా అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీ మాత్రమే కావడం గమనార్హం. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అతను షేర్ చేసే ఒక వ్యాపారపరమైన పోస్టుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అతని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవలే విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ కి అద్దం పట్టేలా ఇటీవలే ఒక కటౌట్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.  ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆడుతుంది.  ఇక మొదటి టి20 మ్యాచ్ కోసం తిరువనంతపురం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి.


 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో లేకపోయినప్పటికీ అతని అభిమానులు మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ కటౌట్ కి పోటీగా భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.  ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎంతోమంది విరాట్ కోహ్లీ అభిమానులు ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన ఎంతోమంది అభిమానులు బాహుబలి సినిమాలో ఉండే రాజు ఎక్కడ ఉన్న రాజే అనే డైలాగ్ను కామెంట్ గా పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: