ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ వర్షాల కారణంగా కొన్ని జట్లకు ప్రతికూలంగా మారుతుంటే, మరికొన్ని జట్లకు అనుకూలంగా మారుతున్నాయి. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ రోజు ఉదయం జరిగిన మ్యాచ్. ఉదయం ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా బలమైన ఇంగ్లాండ్ డి ఎల్ ఎస్ పద్ధతి వలన 5 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. ఇది నిజంగా ఇంగ్లాండ్ కు ప్రతికూలం అని చెప్పాలి. ఒకవేళ పూర్తి మ్యాచ్ జరిగి ఉంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలిచేది. కాగా ఈ రోజు న్యూజిలాండ్ మరియు ఆఫ్గనిస్తాన్ ల మధ్యన జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండా రద్దయింది.

దీనితో ఇరు జట్లకు చెరో పాయింట్ ను ఇచ్చారు. దానితో న్యూజిలాండ్ కు మూడు పాయింట్లు రాగా, ఆఫ్గనిస్తాన్ మాత్రం మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో కేవలం ఒక్క పాయింట్ తో గ్రూప్ 1 నుండి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక ఆఫ్ఘన్ కు మిగిలింది మూడు మ్యాచ్ లు మాత్రమే. అవి కూడా ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి బలమైన జట్లతో రెండు మరియు ఐర్లాండ్ తో మరో మ్యాచ్ ఆడుతుంది. ప్రస్తుతం ఆఫ్ఘన్ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక మరియు ఆసిస్ లను ఓడించడం దాదాపు అసాధ్యమే. ఇక ఐర్లాండ్ ను కూడా అంత తేలిగ్గా ఓడిస్తుంది అని అనుకోవడం లేదు.

సెమీస్ కు వెళ్లాలంటే మాత్రం మూడు మ్యాచ్ లు గెలవడం తో పాటు మెరుగైన రన్ రేట్ ను కూడా కలిగి ఉండాలి. అదే సమయంలో మిగిలిన జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ ఈ రోజు మ్యాచ్ జరిగి ఆఫ్ఘన్ గెలిచి ఉంటే ఛాన్స్ ఉండేది. ఆ విధంగా వర్షం కారణంగా ఆఫ్ఘన్ సెమీస్ అవకాశాలు దెబ్బ తిన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: