నందమూరి హీరో, నటసింహం బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల సీజన్ 2 ప్రారంభం కాగా సీజన్ 2 కూడా అదిరిపోయే రేటింగ్ సంపాదిస్తుంది. ఏకంగా మొదటి ఎపిసోడ్ లోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత, అంతకుమించి బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడును స్పెషల్ గెస్ట్ గా పిలిచిన బాలయ్య ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగి అభిమానులు అందరిలో కూడా మరింత అంచనాలను పెంచేశాడు. ఇక ఇటీవలే నాలుగో ఎపిసోడ్లో భాగంగా తన పాత స్నేహితుడైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గెస్ట్ గా పిలిచారు..


 కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఎంపీ సురేష్ రెడ్డి ఇక ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ సరసన నటించిన హీరోయిన్ రాధిక కూడా ఈ షోకి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలను బాలకృష్ణ వెల్లడించారు. ఒకప్పుడు టీమిండియా కెప్టెన్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో తాను కూడా క్రికెట్ ఆడాను అంటూ బాలకృష్ణ వెల్లడించాడు. అయితే  కిరణ్ కుమార్ రెడ్డి కూడా క్రికెటర్ అవుతాడు అనుకున్న... కానీ చివరికి సీఎం అయ్యాడు అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.


 ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో ఇక ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ గా ఉన్న ఒకప్పటి స్టార్ ప్లేయర్ కూడా క్రికెట్ ఆడాడట. అతను ఎవరో కాదు హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. ఈ క్రికెటర్ కాలేజీలో కిరణ్ కుమార్, బాలయ్య లకు జూనియర్ అంట. ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్ గా ఉండగా అండర్ 19, 22, 5 మ్యాచ్లు కూడా ఆడాడట మొహమ్మద్ అజారుద్దీన్. ఇక మహమ్మద్ అజారుద్దీన్ సైతం తనకు బయోగ్రఫీలో కిరణ్ కుమార్ రెడ్డి గురించి రెండు పేజీలు రాశాడు. హి ఈజ్ మై కెప్టెన్... ఇండియన్ క్రికెట్ టీం లో ఆడాల్సిన వాడు.. ఏపీ అసెంబ్లీలో ఆడుతున్నాడు అంటూ కామెంట్ రాసుకోచాడు అజారుద్దీన్.

మరింత సమాచారం తెలుసుకోండి: