సాధారణం గా దగ్గరిలో ఉన్న స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఏకంగా మ్యాచ్ ను ప్రత్యక్షం గా చూడటానికి క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం దగ్గర లో ఉన్న స్టేడియం  లో మాత్రమే కాదండోయ్ విదేశాల్లో జరిగిన మ్యాచ్ లను సైతం చూసేందుకు కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎక్కడ మ్యాచ్ చూసిన కూడా డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తేనే స్టేడియం లోకి అలోవ్ చేస్తూ ఉంటారు.


 కానీ ఎలాంటి రుసుము తీసుకోకుండానే స్టేడియం లోకి క్రికెట్ ప్రేక్షకులను అనుమతిస్తే నిజంగా క్రికెట్ ప్రేక్షకులు పండగ చేసుకుంటారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. కానీ క్రికెట్ స్టేడియం నిర్వాహకులు మాత్రం ఎప్పుడు ఇలాంటి ఆఫర్లు ప్రకటించరు. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ క్రికెట్ ప్రేక్షకులందరికీ కోసం సిద్ధం  గా ఉంది అన్నది తెలుస్తుంది. మహిళా టి20 లో భాగం గా టీమిండియా ఉమెన్స్ జట్టు ఆస్ట్రేలియా జట్టు తో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ జరగ బోతుంది.


 ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్ల మధ్య ఇక ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈనెల 20 వరకు ఈ సిరీస్ జరగ బోతుంది. అయితే ముంబై వేదిక జరిగే ఈ టి 20 మ్యాచ్లను చూసి ఎందుకు వచ్చే అభిమానుల నుంచి ఎలాంటి చార్జీలు తీసుకో కుండానే ఇక మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. దీంతో ఎంతో ఉంది ప్రేక్షకులు ఇక స్టేడియం కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: