పాకిస్తాన్ జట్టు అటు ఇంగ్లాండ్ కు గడ్డి పోటీ ఇచ్చి గెలుపు అంచుల వరకు చేరుకున్నప్పటికీ ఒత్తిడిని జయించలేక చివరిలో బోల్తా పడి ఓటమి చవిచూసి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండు చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంతో మంది పాక్ మాజీ క్రికెటర్లు సైతం జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు అని చెప్పాలి. జట్టుకు కలిసి వచ్చే పిచ్ లను తయారు చేసుకుని ఎందుకు విఫలమయ్యాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ ఓటమిపై మాజీ లెగ్ స్పిన్నర్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు..దేశవాళి క్రికెట్ కి కూడా పనికిరాని ఆటగాళ్లను తీసుకొచ్చి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ అలీపై విమర్శలు గుప్పించాడు. అసలు మహమ్మద్ అలీ టెస్ట్ బౌలరే కాదు. అతని స్థానంలో జట్టు యాజమాన్యం వేరొకరిని ప్రయత్నిస్తే బాగుండేది. టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ చేసే సత్తా లేదు. ఏదో దేశవాళి క్రికెట్లో నెట్టుకు వస్తున్నాడు తప్ప అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేంత సీన్ అతనికి లేదు. అతను మంచి బౌలింగ్ చేయడు.. బ్యాటింగ్ కూడా రాదు ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రమే. అతనో చెత్త ఆటగాడు. ఇలాంటి వాళ్ళని పాకిస్తాన్ జట్టులో ఆడిస్తే ఇక ఫలితాలు ఇలాగే ఉంటాయి అంటూ కనేరియా వ్యాఖ్యానించాడు. నసీం షాకు అవకాశం ఇవ్వకుండా జట్టు యాజమాన్యం పెద్ద తప్పు చేసింది అంటూ విమర్శించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి