ఎందుకంటే మహమ్మద్ షమీ స్టార్ బౌలర్గా కొనసాగుతున్న సమయంలోనే ఏకంగా అతని మాజీ భార్య అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇక విడాకులు తీసుకుంటున్న సమయంలో మహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది అని చెప్పాలి. ఏకంగా మహమ్మద్ షమీ ఒకానొక సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఈ ఆరోపణలు అతని కెరియర్ పై ఎంతగానో ప్రభావం చూపించాయి అని చెప్పాలి. ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడిన మహమ్మద్ షమి చివరికి టీమ్ ఇండియాలోకి మళ్ళీ రి ఎంట్రీ ఇచ్చాడు.
అయితే గతంలో మహమ్మద్ షమీపై అతని మాజీ భార్య ఇక మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అంటూ చేసిన ఆరోపణలపై అతని సహా బౌలర్ అయిన ఇషాంత్ శర్మ స్పందించాడు. శమీ గురించి నాకు తెలుసు. అతను 200% ఫిక్సింగ్ చేయలేదని నేను నమ్ముతున్నాను. షమీ ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం నన్ను సంప్రదిస్తే నేను ఇదే విషయాలను చెప్పాను అంటూ ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే షమీ మాజీ భార్య ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అతను మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడలేదు అని తేలడంతో క్లీన్ చిట్ ఇచ్చింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి