ప్రపంచ క్రికెట్లో అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఒకరకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి ఎక్కువ ఫండ్స్ అందించేది కూడా బీసీసీఐ అని చెప్పాలి. అందుకే బీసీసీఐ అటు ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది అని ఎంతోమంది క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అందుకే బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతుంది. అందుకు అనుగుణంగానే ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.



 మొన్నటికి మొన్న ప్రపంచ క్రికెట్లో ఎక్కడా లేనివిధంగా పురుష క్రికెటర్లతో సమానంగానే అటు మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక బిసిసిఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా మరో నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఏకంగా పర్యావరణ పరిరక్షణను క్రికెట్తో ముడిపెడుతూ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది బిసిసిఐ. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయం పై ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 పర్యావరణాన్ని క్రికెట్తో ముడిపెట్టిన తీరు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంది అంటే... ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే ఈ ప్లే ఆఫ్స్ లో బౌలర్ ఒక్క డాట్ బాల్ వేస్తే పర్యావరణ పరిరక్షణ కోసం 500 చెట్లు నాటనున్నట్లు బిసిసిఐ తెలిపింది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా చెన్నై, గుజరాత్ జట్ల మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ 34 డాట్ బాల్స్ వేసింది అని చెప్పాలి. దీంతో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏకంగా 17వేల చెట్లను  దేశవ్యాప్తంగా నాటనుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl