
కొన్ని జట్లకు అయితే గాయాల బెడద కారణంగా కెప్టెన్లు కూడా దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఇక అటు లక్నో జట్టుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. లక్నో జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఇక కేఎల్ రాహుల్కు డిప్యూటీగా ఉన్న కృనాల్ పాండ్య జట్టు సారధ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు అని చెప్పాలి. అయితే అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కూడా లక్నో వరుసగా విజయాలు సాధించింది. లక్నో అయితే విజయం సాధించింది. కానీ కృనాల్ పాండ్య ప్రదర్శన మాత్రం పూర్తిగా నిరాశాజనకంగానే ఉంది అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ఓడిపోయి చివరికి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్య చెత్త రికార్డు నమోదు చేశాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆడిన 9 ఇన్నింగ్స్ లో 92.15 స్ట్రైక్ రేటుతో కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగాడు అని చెప్పాలి. దీంతో అతని బ్యాటింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఇలా కెప్టెన్ అయ్యుండి అతి తక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు కృణాల్ పాండ్య.