ముంబై ఇండియన్స్ తరఫున సెలెక్ట్ అయి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు తెలుగు క్రికెటర్‌ తిలక్ వర్మ. ఆ సమయం నుంచి తన అగ్రేషన్ బ్యాటింగ్ స్టైల్‌తో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ రౌండ్-2లో కూడా తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 14 బాల్స్‌లో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాది 43 రన్స్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కి దూసుకెళ్లింది.

ఒకవేళ తిలక్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔట్ కాకపోయి ఉంటే ముంబై ఇండియన్స్ గట్టెక్కేదే. అయినప్పటికీ ఈ యువ ప్లేయర్ పర్ఫామెన్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే మాజీ టీమ్ ఇండియా ప్లేయర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తిలక్ వర్మ స్కిల్స్ & మైండ్‌సెట్, ఫిట్నెస్ అనే రెండు అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని క్రిక్‌బజ్ షోలో సెహ్వాగ్ కామెంట్స్ చేశాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ రాణించాడు. ఆ తర్వాత గాయాలపాలై కొన్ని మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. అతనికి ఫిట్నెస్ లేకపోవడమే ఈసారి ముంబై టీమ్‌కి పెద్ద మైనస్‌గా మారింది. మళ్ళీ సెమీఫైనల్ మ్యాచ్‌లో తిలక్ తిరిగి వచ్చాడు. తన వంతుగా టీమ్‌ని గెలిపించడానికి కృషి చేశాడు. తిలక్ ప్రదర్శన చాలామంది దృష్టిని ఆకర్షించింది. సెహ్వాగ్ కూడా అతని ఆటకు ఫిదా అయిపోయాడు. అంతేకాదు ఈ యువ ప్లేయర్ ఫిట్నెస్ విషయానికి సంబంధించి సలహాలు, సూచనలు చేశాడు.

తిలక్ వర్మ తన స్కిల్స్ ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని వీరు బాయ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ ని చూసి తిలక్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అన్నాడు. సురేష్ కుమార్ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొత్త షాట్లు ట్రై చేస్తూ స్కిల్స్ పెంచుకుంటాడని సెహ్వాగ్ వెల్లడించాడు. తిలక్ వర్మను చూస్తే తనని చూసుకున్నట్లనే ఉందని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. బలహీనతలను బలంగా మార్చుకోవాలని చెబుతూ తనకు 1999లో ఎదురైనా ఒక సంఘటన గురించి పంచుకున్నాడు. 1999లో పాకిస్థాన్ బౌలర్ షోయబ్ అత్తర్ తనను చాలా ఈజీగా ఔట్ చేశాడని.. తన బ్యాట్‌ను కిందకి దించి బంతిని టచ్ చేసే లోపే బంతి వచ్చి తన ప్యాడ్స్‌కి తగిలిందని తెలిపాడు.

అప్పుడే సౌరవ్ గంగూలీ తనకు ఒక విలువైన సలహా ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. "షోయబ్ అత్తర్ ఫాస్ట్ బౌలింగ్‌లో ఔట్ అయిన తర్వాత దాదా (సౌరవ్ గంగూలీ) నాకు ఒక విషయం చెప్పాడు. అతను నన్ను ఫాస్ట్ బౌలింగ్‌లో సమర్థవంతంగా ఎలా ఆడాలో తెలిసినంతవరకు ప్రాక్టీస్ చేయమన్నాడు. కాబట్టి బలహీనతలను అధిగమించడానికి తగినంత ప్రిపేర్ కావాలి. అప్పట్లో నేను మిడిల్ ఆర్డర్ ఆడాను, నాకు స్పిన్ బౌలింగ్ లో ఆడటం అలవాటయింది. ఫాస్ట్ బౌలర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడం ప్రారంభించాను. సెంచరీ కూడా చేశాను. అలాగే, తిలక్ వర్మ తన బలహీనతలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిని అధిగమించాలి.' అని సెహ్వాగ్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: