ఈ ఏడాది భారత్ వేదికగా వండే ప్రపంచం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వన్డే ప్రపంచం నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఇక ఐసీసీ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని జట్లు కూడా ఐసిసి వరల్డ్ కప్ లో టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బల్లులోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే 8 జట్లు నేరుగా వరల్డ్ కప్ కోసం అర్హత సాధించాయి అన్న విషయం తెలిసిందే. కానీ మరో రెండు స్థానాల కోసం కొన్ని జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్లలో పోటీ పడుతూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఈ క్వాలిఫైయర్ మ్యాచ్లు కూడా వరల్డ్ కప్ అధికారిగా మ్యాచ్ ల లాగానే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉండడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లో అటు వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్ లు ఆడెందుకు అర్హత సాధించాలని భావిస్తున్న ఆయా జట్లు ఇక ప్రత్యర్ధులను చిత్తు చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ముఖ్యంగా వరల్డ్ క్రికెట్లో పసికూనగా ఉన్న జింబాబ్వే జట్టు అయితే ప్రత్యర్థులపై పూర్తి ఆదిపత్యాన్ని చలా ఇస్తుంది అని చెప్పాలి. అంతేకాదు ఆ జట్టు ఆటగాళ్ళు కూడా ఇక ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇటీవలే క్వాలిఫైయర్స్ లో భాగంగా ఒమెన్ తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు సికిందర్ రాజా సరికొత్త రికార్డు సృష్టించాడు. జింబాబ్వే తరపున అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా సికిందర్ రాజా రికార్డు సృష్టించాడు. 127 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత సాధించాడు అని చెప్పాలి. కాగా 23 ఏళ్ల కిందట గ్రాండ్ ఫ్లవర్ 128 ఇన్నింగ్స్ లో 4000 పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించగా..  ఇప్పుడు సికిందర్ రాజా ఈ రికార్డును బద్దలు కొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: