సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్లుగా ఉన్న వ్యక్తులు ప్రతి విషయాన్ని కూడా చాలా కచ్చితత్వంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎంపైర్లు పొరపాటున  తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలు చేసే తప్పిదాలు కారణంగా.  మ్యాచ్ స్వరూపం మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇలా తప్పిదాలు చేసినప్పటికీ.. ఎంపైరింగ్ పై మాట్లాడే ధైర్యం మాత్రం చేయరు ప్లేయర్లు. ఇక పోనీలే అంటూ ఊరుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 కానీ భారత మహిళల జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం ఇటీవల ఏకంగా ఎంపైర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటీవల  బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే  అయితే ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్ ప్రీత్ కౌర్.. బంగ్లాదేశ్ లో ఎంపైర్ల ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి ఇకనుంచి బంగ్లాదేశ్ పర్యటనకు రావాలంటే ఇక దీనికి కూడా సిద్ధమై రావాల్సి ఉంటుంది. ఎంపైర్లు   తీసుకున్న ఎన్నో నిర్ణయాలు పై అసంతృప్తిగానే ఉన్నాం అంటూ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే హార్మోన్ ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.


 అంతేకాదు మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లు ఇలా అంపైర్లపై  విమర్శలు చేయడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అనడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఇలా ఫీల్డ్ ఎంపైర్లపై  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన భారత కెప్టెన్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించడంతోపాటు మూడు డిమెరిట్ పాయింట్ లు కూడా ఇచ్చింది ఐసీసీ. 24 నెలల్లో హర్మన్ ప్రీత్ పై మరో డిమిరిట్ పాయింట్ విధిస్తే ఆమె టెస్ట్ మ్యాచ్ లేదా రెండు టెస్టులు ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: