అయితే ఇప్పటికే వరల్డ్ క్రికెట్లో ఛాంపియన్గా నిరూపించుకున్న ఆస్ట్రేలియా.. మరోసారి వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి. కానీ ఇలాంటి టీం కి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నవారు గాయం కారణంగా దూరమయ్యారట. ఇలా దూరమైన వారిలో ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ ఉండగా ఇటీవల మరో ప్లేయర్ గాయపడ్డాడు. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే అటు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా, భారత్తో వన్డే సిరీస్ లు ఆడిబోతుంది.
కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మనికట్టు గాయంతో బాధపడుతున్నాడు. యాషెష్ తర్వాత ఏ సిరీస్లో కనిపించలేదు. సౌత్ ఆఫ్రికా టూర్కు దూరమయ్యాడు. భారత్కు వచ్చే టీంలో అయినా ఉంటాడా లేదా డౌటే. ఇంక మరో కీలక ప్లేయర్ స్మిత్ వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అలాగే మనికట్టు గాయం కూడా వేధిస్తుంది. ఆసీస్ కి బౌలర్ మిచెల్ స్టార్క్ యాషెష్ సిరీస్ తర్వాత ఒక మ్యాచ్ ఆడలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మాక్స్వెల్ కూడా కాలి ఆస్ట్రేలియా బాధపడుతున్నాడు. అతను కూడా సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి తప్పుకున్నాడు. ఇక వరల్డ్ కప్ నాటికి కోరుకుంటాడా లేదా అన్నది డౌటే. ఇలాంటి కీలక ప్లేయర్లు లేకుండా ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలవడం కష్టమే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి