2024 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే హార్దిక్ ఇలా వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. గతంలో ఎప్పుడు సూపర్ పెర్ఫార్మన్స్ చేసి ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలిచేవాడు. కానీ ఇప్పుడు చెత్త ప్రదర్శనలతో ఇలా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతను పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 సారధిగా జట్టుకు విజయాలను అందించడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్ లు ఆడితే కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా హార్దిక్ పాండ్యా పై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్లో పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్లో మాత్రం నిరాశ పరుస్తున్నాడు. మొదటి రెండు మ్యాచ్లలో మినహా మిగతా మ్యాచ్లలో అతను పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు. దీంతో హార్దిక్ లాంటి బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నప్పటికీ.. జట్టులోకి మరో అదనపు బౌలర్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


 ఇలా ఐపీఎల్లో అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యాపై మాజీ ప్లేయర్ మనోజ్ తివారి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ బౌలింగ్ పేలావంగా ఉంది అంటూ విమర్శలు గుప్పించాడు. ఇలాంటి ఫామ్ తో టి20 వరల్డ్ కప్ జట్టుకు పాండ్య ఎంపిక కావడం కష్టమే అంటు అభిప్రాయపడ్డాడు మనోజ్ తివారి. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్ కోటాలో శివం దూబే ఎంపిక చేయాలి అంటూ సూచించాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో బ్యాటింగ్ లో రాణిస్తున్న శివం దూబే బౌలింగ్లో కూడా మంచి ఫామ్ కనబరిస్తేనే వరల్డ్ కప్ కి ఎంపిక కాగలడు అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్ తివారి.

మరింత సమాచారం తెలుసుకోండి: