టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారి కంటే ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకే కాస్త ఎక్కువగా క్రేజీ ఉంది. అందరిలాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ.. ఇక ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే మహేంద్రసింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న  నేపథ్యంలో ఈ సీజన్లో ధోని ఆట ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుంది.


 ప్రతి మ్యాచ్లో కూడా చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడం చూస్తున్న మహేంద్రసింగ్ ధోని విధ్వంసమే సృష్టిస్తున్నాడు. బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. రావడం రావడమే సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ స్కోర్ బోర్డుకే ఆయాసం తెప్పిస్తూ ఉన్నాడు. అతి తక్కువ బంతుల్లోనె భారీ స్కూల్ చేస్తూ జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తున్నాడు. అయితే ఇలా బ్యాటింగ్లో ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్న ధోని చివరి ఓవర్లలో కాకుండా కాస్త ముందు వస్తే బాగుంటుంది అని అభిమానులు అనుకుంటున్నారు. ఎక్కువసేపు ధోని బ్యాటింగ్ను చూసే అవకాశం ఉంటుంది అని ఆశపడుతున్నారు.


 అయితే మహేంద్ర సింగ్ ధోని ఎందుకు ఇలా చివరి ఓవర్లలోనే బ్యాటింగ్ చేయడానికి వస్తున్నారు అనే విషయంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ధోని మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దానికి సంబంధించిన నొప్పి నుండి ఇంకా కోలుకోలేదు. కానీ తాను ఆడకపోతే అభిమానులు అసంతృప్తి చెందుతారని భావించి తనను చూసేందుకు స్టేడియంకి వచ్చే ఫ్యాన్స్ నిరాశ పరచకూడదని చివరి ఓవర్లలోనైనా బ్యాటింగ్ చేయడానికి వస్తున్నాడు ధోని. ప్రేక్షకుల నుంచి ధోనికి లభించే  ప్రేమ ఆదరణ అద్భుతం అంటూ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: