సల్మాన్ ఖాన్ : సల్మాన్ ఖాన్ కేరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన దబాంగ్ మూవీలో ఐటమ్ సాంగ్ లో సల్మాన్ కి జంటగా మలైకా అరోరా కాలు కదుపారు. మలైకా ఎవరో కాదు సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య. ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు. ఇలా మలైక సల్మాన్ కు వరుసకు మరదలు అవుతుంది.
అనిల్ కపూర్ : అప్పట్లో అనిల్ కపూర్ శ్రీదేవి బాలీవుడ్ లో బెస్ట్ పేర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అయితే శ్రీదేవి ఎవరో కాదు అనిల్ కపూర్ అన్న అయినా బోనీకపూర్ భార్య అంటే అనిల్ కపూర్ కి వరుసకు వదిన అవుతుంది.
సైఫ్ అలీ ఖాన్ : సైఫ్ అలీ ఖాన్ రెండో వివాహం కరీనాకపూర్ ను చేసుకున్నారు. అయితే కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అలీఖాన్ ఒక సినిమాలో కరీనా అక్క అయినా కరిష్మా కపూర్ తో రొమాన్స్ చేశాడు. ఇలా వదిన వరుసయ్యే కరిష్మాతో సైఫ్ రొమాన్స్ లో మునిగితేలాడు.
అజయ్ దేవగన్ : అజయ్ దేవగన్, రాణి ముఖర్జీ బాలీవుడ్ లో హిట్ పేయిర్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రాణి ముఖర్జీ వరుసకు అతనికి మరదలు అవుతుంది. ఎందుకంటే అతని భార్య కాజోల్ కి రాణి ముఖర్జీ కజిన్ సిస్టర్ అవుతుంది.
ఉదయ్ చోప్రా : అప్పట్లో ఉదయ్ చోప్రా రాణి ముఖర్జీ కలిసి చేసిన ఓ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే రాణి ముఖర్జీ వరుసకు ఉదయ్ చోప్రాకి వదిన అవుతుంది ఎందుకంటే రాణి ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా ఉదయ్ చోప్రా కి వరుసకు అన్నయ్య అవుతాడు.