ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... మహేంద్ర సింగ్ ధోని సహాయం కోరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యానికి సహాయం కావాలంటూ టెరిటోరియల్ ఆర్మీకి రక్షణ శాఖ పిలుపునిచ్చింది. దీనితో సైన్యానికి అనుబంధంగా ఉంటూ టెరిటోరియల్ ఆర్మీకి చేయూత అందించబోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆ ఆర్మీలో మహేంద్రసింగ్ ధోని అలాగే కపిల్ దేవ్ కూడా ఉన్నారు. దీంతో మహేంద్రసింగ్ ధోని కూడా పాక్తో యుద్ధం చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని... ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రద్దు కావడంతో... జార్ఖండ్ వెళ్ళిపోయాడు. తన కుటుంబంతోనే మహేంద్ర సింగ్ ధోని ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ భారత ఆర్మీకి సహాయం చేయాలనుకుంటే.... మహేంద్ర సింగ్ ధోని బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఆయన నేరుగా యుద్ధం చేయకపోవచ్చు. ఆర్మీకి సలహాలు ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. దీంతో... మహేంద్ర సింగ్ ధోని యుద్ధ రంగంలోకి దిగాలని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి