టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్నాడా..? ఆల్రెడీ త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి చెప్పేశాడా..? అంటే అవునన్న స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇటీవల భారత సారథి రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ షాక్ నుంచి క్రికెట్ ల‌వ‌ర్స్ ఇంకా తేరుకోక ముందే హిట్‌మ్యాన్ బాట‌లో విరాట్ కోహ్లి కూడా న‌డ‌వ‌బోతున్నాడ‌నే వార్త మ‌రో షాక్ త‌గిలేలా చేసింది.


భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌.. లాంగ్ ఫార్మాట్‌కు విడ్కోలు ప‌ల‌కాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఈ నిర్ణ‌యాన్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)కి కూడా తెలియజేశాడట. అయితే బోర్డు పెద్దలు కోహ్లీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు.. హిట్‌మ్యాన్ టెస్టుల్లో అంత‌గా ఫామ్‌లో లేడు. కానీ కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ దూసుకుపోతున్నాడు. లాంగ్ ఫార్మాట్‌లో ఎన్నో రికార్డులు నెల‌కొల్పాడు.


పైగా జూన్ నుంచి ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ త‌ర్వాత‌ కెప్టెన్‌గా కోహ్లిని నియమించాలని బీసీసీఐ చూస్తుంది.  ఇటువంటి టైమ్ లో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఇబ్బంది ప‌డ‌టం ఖాయం. అదేవిధంగా ప్ర‌స్తుతం టీమ్ లో శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి యంగ్ క్రికెట‌ర్స్ కంప్లీట్‌గా సెటిలై ఫామ్‌లోకి వ‌చ్చేంత‌ వరకు కోహ్లీ లాంటి ఎక్స్‌పీరియెన్స్‌డ్ క్యాంపెయినర్ అవసరం ఎంతైన ఉంది. ఈ నేప‌థ్యంలోనే విరాట్‌ రిటైర్మెంట్‌కు బోర్డు స‌భ్యులు నో చెబుతున్నార‌ట‌. రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుని మరికొన్నేళ్లు టెస్ట్ టీమ్‌లో కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ రిక్వెస్ట్ చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి కోహ్లి ఫైన‌ల్ గా ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి. ఒక‌వేళ అత‌ను రిటైర్మెంట్ వైపే మొగ్గు చూపితే బీసీసీఐ చేసేదేమీ లేద‌నే చెప్పొచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: