
సాధారణంగా ఒక్క బంతికి 1 లేదా 2 పరుగులు తీస్తుంటారు. ఎప్పుడైనా ఫీల్డింగ్‌లో పొరపాట్లు జరిగితే 3–4 పరుగులు రావచ్చు. చివరకు 6 పరుగులు అధికంగా వస్తాయి. కానీ 1984లో జరిగిన ఓ అరుదైన ఘటన మాత్రం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. 1984లో ఆస్ట్రేలియాలోని క్లిఫ్టన్ హిల్‌లో విక్టోరియా, స్క్రాచ్ XI మధ్య ఒక ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో జరిగిన ఓ వింత సంఘటన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ జరుగుతున్న మైదానంలో మధ్యలో ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆట ప్రారంభమైన తర్వాత అడ్డంగా ఉన్న ఆ చెట్టు ఆటపై ప్రభావం చూపింది.
ఓ బాలర్ వేసిన బంతిని బ్యాటర్ స్ట్రైక్ చేసి పరుగుల కోసం పరిగెత్తసాగాడు. అయితే ఆ బంతి మైదానంలోని చెట్టుకు జారిపోయి చిక్కుకుపోయింది. ఫీల్డర్లు ఎంత ప్రయత్నించినా ఆ బంతిని తీయలేకపోయారు. ఈ లోగా ఇద్దరు బ్యాటర్లు వికెట్ల మధ్య తిరుగుతూ పరుగులు పెడుతుండగా, వాళ్లు దాదాపు 6 కిలోమీటర్లు పరిగెత్తారు.
ఆ సమయంలో ఆటకు యాంపైర్లు ఉన్నప్పటికీ, అంత ఎక్కువ పరుగులు లెక్కించాలా? ఆపాలా? అనే సందిగ్ధతలోకి వెళ్లిపోయారు. చివరికి ఫీల్డర్లు చెట్టును నరికి బంతిని బయటకు తీయాల్సి వచ్చింది. ఆ ఒక్క బంతికి 286 పరుగులు వచ్చినట్లు అంచనా. ఈ సంఘటన చరిత్రలో ఎలా నమోదైందన్నా విషయానికి వస్తే.. ఈ వింత సంఘటనను ఆంగ్ల జర్నలిస్ట్ “Martin Williamson” తమ కథనాల్లో ప్రస్తావించారు. అలాగే చాలా సంవత్సరాల తర్వాత దీనిపై వివిధ క్రికెట్ బ్లాగ్‌లు, వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. ఇది అధికారిక రికార్డుల్లో లేనప్పటికీ, క్రికెట్ చరిత్రలో వినోదభరితమైన, అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.
క్రికెట్‌లో ఎన్నో రికార్డులు, విపరీతమైన మైలు రాళ్లు ఉంటాయి. కానీ ఒక్క బంతికి 286 పరుగులు అనే ఈ సంఘటన వినగానే ఒక జోక్‌లా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది క్రికెట్‌లో జరిగే అనూహ్య సంఘటనలకు ఓ నిదర్శనం. ఆటలో ఉన్న విశేషతలు, వినోదం, వింతలు ఇవే మరి ఆటను మరింత ప్రత్యేకంగా, ప్రియంగా మారుస్తాయి.