
ఇంగ్లాండ్లో జరుగుతున్న అండర్సన్ - టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హోం లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్ లో నాలుగు రోజులపాటు ఆధిపత్యం చెలాయించి ఐదో రోజు పట్టుకోల్పోవడంతో టీమిండియా ఓటమి పాలయింది. ఇక రెండో టెస్టు మ్యాచ్లో మాత్రం ఆఖరి రోజు అద్భుతమైన ఆటతీరుతో తిరుగులేని ఘనవిజయం సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1 - 1 తో సమం చేసింది. సెంచరీ తోపాటు బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. శుభమన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు సాధించి ఇంగ్లాండ్ వేదికగా ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాధించిన భారతీయ బ్యాటర్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ మాత్రమే కాకుండా రెండో ఇన్నింగ్స్ లోను ఏకంగా 161 పరుగులు సాధించాడు.
రెండో ఇన్నింగ్స్ లోను డబుల్ సెంచరీ సాధించే క్రమంలో వేగంగా ఆడి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ ముందు టీం ఇండియా ఏకంగా 600 పైగా లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఇంగ్లాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేక పోయింది. ఆదిలోనే భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పై చేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు 90 ఓవర్లు కూడా ఆడలేకపోయారు. రెండో ఇన్నింగ్స్ లో 69 ఓవర్ పూర్తికాకముందే ఆల్ అవుట్ అయ్యారు. దీంతో టీమ్ ఇండియా 336 పరుగులతో భారీ విజయం సాధించింది. పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం. అలాగే బర్మింగ్ హోం లో 58 ఏళ్ల నుంచి టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. అక్కడ ఇదే తొలి విజయం. లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుంచి మొదలుకానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు