
అయితే ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ ఇందుకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తో ఇటీవలే ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడారు లలిత్ మోదీ. అప్పట్లో టీవీలలో ప్రసారం కానటువంటి ఒక ఒరిజినల్ వీడియోని సైతం చూపించారు.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలన్నీ కూడా ఆఫ్ లో ఉన్నాయి. అయితే నా సెక్యూరిటీ కెమెరా మాత్రమే ఆన్లో ఉందని.. ఆ కెమెరానే శ్రీశాంత్, భజ్జి మధ్య జరిగిన గొడవను రికార్డు చేసిందంటూ తెలియజేశారు.
భజ్జీ, శ్రీశాంత్ చెంప పైన ఇలా కొట్టాడు అంటూ ఆ వీడియో ఫుటేజ్ ని చూపించారు లలిత్ మోదీ. మళ్లీ ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో నేటిజన్స్ ఈ విషయంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై హర్భజన్ సింగ్ ఇటీవలే మరొకసారి శ్రీశాంత్ కు కూడా క్షమాపణలు చెప్పారు. మాజీ క్రికెటర్ అశ్విన్ తో మాట్లాడుతూ తన జీవితంలో ఏదైనా మార్చాలనుకొనే సంఘటన ఏదైనా ఉంది అంటే అది ఈ సంఘటనే అని తెలిపారట.. తాను అలా చేసి ఉండకూడదు దీనిపైన ఇప్పటికే తాను 200 సార్లు క్షమాపణలు చెప్పాను కొన్నేళ్ల క్రితం నేను శ్రీశాంత్ కూతురితో కూడా మాట్లాడానని.. తన కూతుర్ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న తను మాత్రం మీరు మా నాన్నను కొట్టారు నేను మీతో మాట్లాడను అంటూ చెప్పడంతో నా గుండె పగిలినట్టుగా అయిపోయింది.. దీంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇప్పటికి ఆమెకు ఎన్నోసార్లు సారి చెబుతూనే ఉన్నానని తెలిపారు హర్భజన్ సింగ్.