
వాట్సాప్ ద్వారా సిబిల్ స్కోర్ ఉచితంగానే చెక్ చేసుకోవచ్చట. అలాగే మనం తీసుకునే లోన్ కి ఎంత వడ్డీ పడుతుందనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చని తెలుస్తోంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఈ డేటాని సేకరిస్తారట. ఇప్పుడు వాట్సప్ ద్వారా ఉచితంగానే ఎక్స్పీరియన్స్ ఇండియా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ల కంపెనీల చట్టం 2005 లో లైసెన్స్ పొందిన ప్రకారం.. ఎక్స్పీరియన్స్ ఇండియా వాట్సాప్ కంపెనీ వాట్సప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట.
సిబిల్ స్కోర్ లో ఎలాంటి మోసాలు జరగవని , ఒకవేళ జరిగితే వెంటనే అరికట్టవచ్చని తెలియజేస్తోంది ఆ సంస్థ. ముందుగా ఎక్స్పీరియన్ ఇండియన్ వాట్సాప్ నెంబర్ అయినా 9920035444 నెంబర్ ను మీ మొబైల్లో సేవ్ చేయాలి. దీని తర్వాత మీ మొబైల్ నెంబర్ కు ఒక వాట్సప్ లింక్ హలో అనే సందేశం ద్వారా వస్తుందట. అటు తరువాత మీ వివరాలను పంపించాల్సి ఉంటుంది. వివరాలలో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పేరు మాత్రమే పంపించాలి. దీని తర్వాత మీ వాట్సాప్ లోనే క్రెడిట్ స్కోర్ అనేది తెలియజేయబడుతుంది.