ప్రతి రోజు రాత్రి 7.30 అయ్యిందంటే చాలు అందరి ఇళ్ళల్లో వినిపించే పాట ఏదన్నా ఉంది అంటే అది కార్తీక దీపం సీరియల్ పాటనే.. ఆ సీరియల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వొత్తులు వేసుకుని మరి ఎదురుచూస్తూ ఉంటారు. స్టార్ మా టీవి లో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సీరియల్‌‌లో దీపగా,  వంటలక్కగా చేస్తోన్న ప్రేమి విశ్వనాధ్ ప్రేక్షకులందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన నటనతో అందరి మనసు గెలుచుకుంది. ప్రతి ఒక్కరి ఇంటి ఆడపిల్లగా దీపను ఆరాధిస్తారు బుల్లితెర ప్రేక్షకులు. ఇంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ప్రేమి విశ్వనాధ్ గురించిన  కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.. !  స్వతహాగా దీప మన తెలుగు అమ్మాయి కాదు. దీప ఒక కేరళ కుట్టి అన్నమాట. ప్రేమి విశ్వనాథ్ డిసెంబర్ 2 న 1991వ సంవత్సరంలో కేరళలో జన్మించింది. అయితే దీప మొదటగా మలయాళ  బుల్లితెర ఛానల్ లో నటించింది.

అయితే   ఏసియానెట్‌లో ప్రసారం అయిన  కరుతముత్తు అనే సీరియల్  మంచి హిట్ అయింది. అప్పటినుంచి ఆమె అక్కడ బాగా పాపులర్ అయ్యింది. ఇదే సీరియల్‌ను ఇక్కడ మనం ప్రతి రోజు చూస్తున్న  కార్తీక దీపం పేరుతో రీమేక్ చేసి తెలుగులో ప్రసారం చేస్తున్నారు. అయితే మన తెలుగులో కూడా ప్రేమి విశ్వనాధ్ హీరోయిన్ గా చేయడం విశేషం.. ఈ సీరియల్ తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రేమి విశ్వనాథ్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె తల్లి తండ్రులు  విశ్వనాథ్, కాంచన విశ్వనాథ్ లు. ప్రేమి విశ్వనాధ్ కు వివాహం కూడా జరిగింది. ప్రేమి విశ్వానథ్ భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయన అస్ట్రాలజీలో ఇండియలోనే ఒక ఫేమస్ పెర్సన్. ప్రస్తుతం ప్రేమి తన భర్తతో కలిసి ఎర్నాకుళంలో నివసిస్తోంది. ఆమెకు ఒక  అన్నయ్య కూడా ఉన్నారు. అతని పేరు శివ ప్రసాద్. .ఆమె సోదరుడు శివ ప్రసాద్ ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్. ఆయనకు ఎర్నాకుళంలో రెండు సొంత  స్టూడియోలు కూడా ఉన్నాయి.

 ప్రీమి విశ్వనాథ్ కూడా తన సోదరుడిలాగే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంట.. ఆ ఇష్టంతో కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది.  ప్రేమి టీవీ ప్రపంచంలోకి రాకముందు ఎర్నాకుళంలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగినిగా పనిచేసింది. అలాగే కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసింది.  ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం నటన విషయానికి వస్తే.. తెలుగులో 16 అక్టోబర్ 2017 న విడుదలైన కార్తిక దీపంతో ప్రేమి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇదే సీరియల్ మలయాళంలో 2013 లో ప్రారంభమైంది. ఈ సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ నటించినందుకు ఆమెకు ఉత్తమ మహిళా నటి (2014) ఆసియానెట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. బుల్లితెరలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ ను ఇన్ని సంవత్సరాలు  అవుతున్న గాని ప్రేక్షకులు ఇప్పటికి ఆదరిస్తున్నారంటే ఈ క్రెడిట్ ప్రేమి విశ్వనాధ్ కే దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: